సోనియా గాంధీ దయవల్లే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం

సోనియా గాంధీ దయవల్లే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం

కేసముద్రం/గూడూరు, ముద్ర: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది మంది యువకులు ఆత్మబలి దానాలు చేసుకుంటుంటే చలించిన ఏఐసీసీ అధినేత సోనియాగాంధీ యూపీఏ సర్కారు హయాంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చొరవ చూపడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, నెల్లికుదురు, గూడూరు, ఇనుగుర్తి మండలాల్లో సోనియా గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నేతలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ సోనియా గాంధీ దయ వల్ల ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన సీఎం కేసీఆర్ నియంతృత్వ పరిపాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు.

ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీఆర్ఎస్ ను వచ్చే ఎన్నికల్లో గద్దె దించడం ఖాయమని పేర్కొన్నారు. కేసముద్రం మండలంలో టీపీసీసీ సభ్యుడు గుగులోత్ దసురు నాయక్, మండల పార్టీ అధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ అల్లం నాగేశ్వరరావు, బండారు దయాకర్, నెల్లికుదురు లో మాజీ జడ్పిటిసి హెచ్.వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధి కుమ్మరి కుంట్ల మౌనేందర్, ఓబిసి అధ్యక్షుడు వరిపల్లి పూర్ణచందర్, రత్నపురం యాకయ్య, బత్తిని అనిత, గూడూర్ లో మండల పార్టీ అధ్యక్షుడు కత్తి స్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నునావత్ రమేష్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నునావత్ రాధ, యాకూబ్ పాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని ఘనంగా సత్కరించారు. ఆయా మండలాల్లోని గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు