చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం కరీంనగర్ రూరల్ సిఐ ప్రదీప్ కుమార్

చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం కరీంనగర్ రూరల్ సిఐ ప్రదీప్ కుమార్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం 24 గంటల పాటు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ తెలియజేశారు. బుధవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ పోలీసుల ధ్యేయమని, ప్రజలు పోలీస్ శాఖకు సహకారం అందించాలన్నారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ లకు పాల్పడితే కేసులు తప్పవన్నారు. ప్రజలు సమస్యలుంటే నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. బాధ్యతలు స్వీకరించిన ప్రదీప్ కుమార్ కు ఎస్ఐలు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.