వెంటాడి కాటేసిన ఎలుగుబంటు: వ్యక్తికి తీవ్ర గాయాలు
ముద్ర,ఎల్లారెడ్డిపేట: వెంటాడి వెంబడించి కాటేసిన ఎలుగుబంటు దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న గుగులోతు రవి ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువు తండా కు చెందిన గుగులోతు రవి శనివారం గొర్రెలను కాస్తూ అడవిలోకి వెళ్ళాడు. అక్కడే పిల్లలను పెట్టిన ఎలుగుబంటి ఉండడంతో గమనించకుండా ఉన్న రవిని ఎలుగుబంటి వెంబడించడంతో ప్రక్కనే ఉన్న చెట్టును ఎక్కాడు తనతోపాటు ఎలుగుబంటి కూడా చెట్టు పైకి ఎక్కి రవిని తీవ్ర గాయాల పాలు చేసింది.
రవి చాకచక్యంగా తన చేతిలో ఉన్న టవాలను కిందికి ఇసరడంతో ఎలుగుబంటి టవాలను ముక్కలుగా చింపే క్రమంలో రవి కేకలు వేయడంతో పక్కనే ఉన్న పొరుగువారు వచ్చి ఎలుగుబంటిని కర్రలతో నివారించారు. గాయపడిన రవిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిలకడగనే ఉన్నాడు.ఎంఆర్ఐ స్కానింగ్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని వైద్యులు తెలిపారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సక్కారం మాట్లాడుతూ మేము తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.