తుంగతుర్తి పీఠం పిడమర్తి కేనా?

తుంగతుర్తి పీఠం పిడమర్తి కేనా?
  • సూర్యాపేట తుంగతుర్తి అభ్యర్థుల ఖరారు విషయంలో పీసీసీ అధ్యక్షుడు పట్టుబడుతున్నాడా?
  • ఉత్తంకుమార్ రెడ్డి భట్టి విక్రమార్క మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి బాసటగా నిలిచారా?
  • నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులను కేసులపాలు చేసిన మోత్కుపల్లిని తుంగతుర్తి కాంగ్రెస్ ఆహ్వానిస్తుందా?
  • సూర్యాపేటలో దామోదర్ రెడ్డి తుంగతుర్తి లో పిడమర్తి రవి పేర్లు ఖరారు కానున్నాయా
  • రెండు మూడు రోజుల్లో తిరుమల సూర్యాపేట తుంగతుర్తి అభ్యర్థుల పేర్లు
  • ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న రెండు కవల నియోజకవర్గాల కాంగ్రెస్ శ్రేణులు.


తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఫలానా అభ్యర్థి అయితే తుంగతుర్తిలో కాంగ్రెస్ గెలుస్తుంది అనే చర్చ ప్రతి గ్రామంలో కొనసాగుతుంది. ఎవరికి తోచిన పేరు చర్చించుకుంటున్నారు. పాతవారు 23 మంది అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకోగా కొత్తగా మరో ముగ్గురు చేరారు. వారితో కలిపి సుమారు 26 మంది ప్రస్తుతం అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. వీరిలో పోటీ చేసి ఓడిన వారు కొందరైతే, తుంగతుర్తి నుండి ఒకసారి, టిడిపి అభ్యర్థిగా పోటీచేసి గెలుపు పొందిన వారు మరొకరు. మిగతావారు కొత్తగా టికెట్ ఆశిస్తున్న వారు వారిలో డాక్టర్ పిడమర్తి రవి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమ నాయకుడిగా పోరాటం చేసి రాష్ట్రవ్యాప్తంగా పేరు సంపాదించారు. డాక్టర్ పిడమర్తి రవి, విద్యావంతుడే కాక అధికారపార్టీ అభ్యర్థి తో సమానంగా పోరాటం చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు .అధికార పార్టీ అభ్యర్థికి సమవుజ్జిగా పిడమర్తి రవి అయితేనే సరిపోతుందని మాట పలువురు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గ ఓటు బ్యాంకు సుమారు 60000 ఉంటుందని పిడమర్తి రవి సామాజిక వర్గం అదే కావడంతో అటు కాంగ్రెస్ పార్టీ బలం ,సొంత సామాజిక వర్గం ,బలం కూడా తోడు అవుతుందనే మాట పలువురు ఆ సామాజిక వర్గ నేతలు చెబుతున్న మాట. సామాజిక బలం తో పాటు ఆర్థిక బలం ఎన్నికలకు అవసరమవుతుందని మాట పలువురు అంటున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఆర్థికంగా బలంగా లేని పక్షంలో అభ్యర్థిని సూచించే గాడ్ ఫాదర్ ఎన్నికల భారాన్ని మోయాల్సి వస్తుందని మాట పలువురు చెబుతున్నారు. ఆ కోవాలో ఒకరిద్దరు నేతలు మాత్రమే కనిపిస్తున్నారు.

పిడమర్తి రవికి తనను పార్టీలోకి ఆహ్వానించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అండ దండిగా ఉండడంతో కాంగ్రెస్ బలం, సామాజిక వర్గ బలం, పొంగులేటి అండ మూడు కలిసి అభ్యర్థిగా మెరుగైన ఫలితాలను పొందవచ్చు అనే మాట సీనియర్ కాంగ్రెస్ నాయకుల నుండి వినవస్తుంది. పోటీలో ఉన్న అభ్యర్థులలో బోనగిరి పార్లమెంటు సభ్యుడు సూచించే వారు సైతం ఉన్నారు. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గంలో గత 40 సంవత్సరాలుగా బలమైన కేడర్ను కలిగి ఉన్న వ్యక్తిగా నేటికీ పేరు ఉంది ఆర్థికంగా బలాన్ని ఇచ్చే గాడ్ ఫాదర్ ఉన్న క్యాడర్ పరంగా ఆ వ్యక్తికి ,అభ్యర్థికి దామోదర్ రెడ్డి అండ నూటికి నూరు శాతం అవసరమని అదే లేని పక్షంలో దామోదర్ రెడ్డిని కాదని పోటీలో నిలిచిన అభ్యర్థికి ఓటమి తప్పకపోవచ్చని అందుకు గత ఫలితాలు నిదర్శనమని పలువురు కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆర్థిక సామాజిక కాంగ్రెస్ పార్టీ అండ తోపాటు మాజీ మంత్రి ఆశీస్సులు కూడా మెండుగా ఉన్నవారే బరిలోకి దిగాల్సి ఉంటుందని అలాంటి వ్యక్తి పోటీలో ఉంటే ఈసారి అధికార పార్టీ అభ్యర్థిని నిలవరించడం సునాయాసంగా ఓడించవచ్చనీ  చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సర్వేలలో తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ గెలుపొందిదిగా ఉందని అందుకే ఇంతమంది పోటీ పడుతున్నారని మాట సర్వత్రా  వినవస్తుంది.

గత రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన అద్దంకి దయాకర్ సైతం తాను తిరిగి పోటీ చేయడానికి పిసిసి అధ్యక్షుని అండతో బలమైన ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సూర్యాపేట ,తుంగతుర్తి టికెట్లపై పిసిసి అధ్యక్షుడు గట్టిపట్టు పట్టినట్లుగా పలువురు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సూర్యాపేట నుండి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కాకుండా పటేల్ రమేష్ రెడ్డికి ఇప్పించాలని అలాగే తుంగతుర్తి అభ్యర్థిగా అద్దంకి దయాకర్ కు టికెట్ ఇప్పించాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తుండగా దామోదర్ రెడ్డికి బాసటగా ఉత్తంకుమార్ రెడ్డి ,సి ఎల్ పి నేత భట్టి విక్రమార్క నిలిచారని దీంతో సూర్యాపేట తుంగతుర్తి టికెట్ల ప్రకటన ఆలస్యం అవుతుందని విశ్వసనీయంగా తెలుస్తోంది .ఒక దశలో తుంగతుర్తి సూర్యాపేట టికెట్ల ఖరారు విషయం ఏఐసిసి అధినాయకత్వం సోనియా, రాహుల్ ,ఖర్గే చేతికి వెళ్లిందని ఇక్కడ ఎవరు ఏమి చేయలేరని తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో తుంగతుర్తి సూర్యాపేట అభ్యర్థుల పేర్లు వెలువడవచ్చని అది దామోదర్ రెడ్డి, పిడమర్తి రవి కావచ్చు అనే ఊహాగానాలు వినబడుతున్నాయి. వీరిదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన మోత్కుపల్లి నరసింహులు సైతం తుంగతుర్తి టికెట్ ఆశిస్తున్నారు  .కానీ మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతగా స్వాగతించక పోవచ్చు అని గతంలో ఇదే తుంగతుర్తి నుండి పోటీ చేసిన నరసింహులు టిడిపి నుండి గెలుపొందడం నాడు టిడిపి ,కాంగ్రెస్ మధ్య తీవ్ర గర్షణలు జరగడం తెలిసిన విషయమే .మరి మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ లోకి వస్తే తుంగతుర్తి ప్రాంత నాయకులు  నరసింహులు వెంట ఉంటార ? అనేది ప్రశ్న .జిల్లాకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకుడు మద్దిరాల మండల గ్రామ వాసి అయిన కాంగ్రెస్ నాయకుని పై కేసు పెట్టించడానికి నాడు హైదరాబాదులో ధర్నాలు చేసి ఆ నాయకుడిని ముప్పు తిప్పలు పెట్టిన నరసింహులు టికెట్ తెచ్చుకుంటే ఆ నాయకుడు ఎంతవరకు సహకరిస్తాడని మాట సర్వ త్రావిన వస్తుంది .ఏది ఏమైనా తుంగతుర్తి టికెట్ ఎవరికి ఇస్తారు వారి పేర్లు ఏమిటో తెలవాలంటే మరో నాలుగు ఐదు రోజులాగాల్సిందే.