ఫార్మా కంపెనీలో రియాక్టర్ బ్లాస్ట్.. ఇద్దరు మృతి

ఫార్మా కంపెనీలో రియాక్టర్ బ్లాస్ట్.. ఇద్దరు మృతి

హైదరాబాద్‌ను వరుస అగ్నిప్రమాదాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. తాజాగా జీడిమెట్లలోని ఫార్మా కంపెనీలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. రియాక్టర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులను రవీందర్ రెడ్డి, కుమార్‌లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.