రెండు ఇసుక లారీలు డీ ఒకరికి గాయాలు

రెండు ఇసుక లారీలు డీ ఒకరికి గాయాలు

ముద్ర న్యూస్, రేగొండ: రేగొండ మండలం రూపిరెడ్డీ పల్లి దమ్మన్న పేట క్రాస్ వద్ద రెండు లారీలు డీ కొన్న సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది స్థానికుల సమాచారం ప్రకారం భూపాలపల్లి నుండి ఇసుక లోడుతో వస్తున్న రెండు లారీలు ముందుగా ఒక లారీ దమ్మన్న పేట క్రాస్ వద్ద ఆగి ఉండగా మరో లారీ స్పీడుగా వచ్చి ఆగి ఉన్న లారీని డీ కొట్టడంతో డీ కొట్టిన లారీలో డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కు పోయాడు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా జేసీబీ ని పిలిపించి లారీలో ఇరుక్కు పోయిన డ్రైవర్ ను బయటికి తీశారు .వెంటనే 108 ద్వారా పరకాల హాస్పటల్ తరలించారు.