నోరా... తాటి మట్ట...

నోరా... తాటి మట్ట...
  • మచ్చలేని మనిషి హరీష్ రావు 
  • బిజెపి నేత నరోత్తం రెడ్డి పై బీఆర్ఎస్వీ నేతల ధ్వజం

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట:మచ్చలేని మనిషి మంత్రి హరీష్ రావు పై అసత్య ఆరోపణలతో తీవ్ర విమర్శలు చేయడం బిజెపి నేత నరోత్తమ రెడ్డికి తగదని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం సిద్దిపేట జిల్లా నేతలు హితవు చెప్పారు మంగళవారం నాడు సిద్దిపేటలోని భారత్ నగర్ లో ఉన్న మంత్రి హరీష్ రావు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్వీ నేతలు మెరుగు మహేష్, జువ్వన్న కనకరాజు, పయ్యావుల శ్యామ్ యాదవ్, గరిపల్లి మహిపాల్ గౌడ్, రాజు, రవి,అరవింద్ రెడ్డి, మధు, కనకరాజు, మహేష్ లు మాట్లాడారు. మంత్రి హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో పాటు మంత్రిగా రాష్ట్ర ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అభివృద్ధి కాముకూనిగా, మచ్చలేని మనిషిగా పేరుగాంచాడని వారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున నరోత్తమ రెడ్డి రాజకీయంగా వార్తల్లో కనిపించడం కోసమే హరీష్ రావు పై అవాకులు చవాకులు పేలాడని వారన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడిన నరోత్తంది నోరా తాటి మట్ట అంటూ వారు అగ్రహం వ్యక్తం చేశారు. నరోత్తంపై పోలీస్ స్టేషన్లలో కోర్టులో కేసులు ఎన్నో ఉన్నాయని నకిలీ నోట్ల విక్రయ కేసుల్లోనూ హస్తముందని వారు ఆరోపించారు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పలు కేసుల వివరాలను నరోత్తం రెడ్డి ఎదుర్కొంటున్నాడని సంబంధిత డాక్యుమెంటు కేసుల వివరాలను టిఆర్ఎస్వి నేతలు మీడియాకు అందజేశారు మరోసారి హరీష్ రావు జోలికొస్తే నరోత్తమును సిద్ధిపేట నుంచే కాక రాష్ట్రం నుంచి తన్ని తరిమేస్తామని వారు హెచ్చరించారు.