ముస్లింల సంక్షేమం కోసం బిఆర్ ఎస్ ప్రభుత్వం కృషి

ముస్లింల సంక్షేమం కోసం బిఆర్ ఎస్ ప్రభుత్వం కృషి
  • ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ  ప్రభుత్వా అధ్వర్యంలో ఇఫ్తార్ విందు 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ముస్లింల సంక్షేమం కోసం బిఆర్ ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు.   జగిత్యాల పట్టణ ముస్లిం కమ్యూనిటీ హల్ ఖిల గడ్డ, రాయల్ ఫంక్షన్ హాల్ లో  రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ , తామ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ పాల్గొని మాట్లాడుతూ సియం కేసిఆర్ అన్ని మతాలను గౌరవిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్నారని అన్నారు.

అనంతరం రంజాన్ మాసం సందర్భం గా ప్రభుత్వం  ముస్లింలకు రంజాన్ కానుకలను జామా మసీద్, ఇస్లాం పుర లో అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్, మైనార్టీ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ ముజాహిధ్, కౌన్సిలర్ లు, మైనార్టీనాయకులు, సదర్ లు, తదితరులు పాల్గొన్నారు.