పోలీసుల అదుపులో మావోయిస్ట్ నకిలీ  లేఖల అనుమానితులు...?

పోలీసుల అదుపులో మావోయిస్ట్ నకిలీ  లేఖల అనుమానితులు...?

*లేఖలు రాసింది తానేనని ఒప్పుకున్నట్లు సమాచారం.
*ఒక్కడే చేశాడా లేక ఎంతమంది చేశారనే దానిపైన విచారణ.
*గతంలో అనుమానితుడు పై కేసులు ఉన్నట్లు సమాచారం.

బీర్పుర్,ముద్ర: గత రెండు రోజులుగా జిల్లాలో మావోయిస్టుల పేరిట నకిలీ లేఖల విడుదలైన కేసుల విషయంలో అనుమానితున్ని పోలీసులు  అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. మండలంలోని నర్శింహులపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని జిల్లా స్థాయి ఉన్నత అధికారులు పూర్తి విషయాలు రాబట్టేందుకు ఎంక్వయిరీ చేస్తున్నట్లు సమాచారం. కాగా మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లతోపాటు మండల ఎంపీపీ ఒక ఎంపీటీసీ వివిధ గ్రామాలకు చెందిన రైతులు సుమారు 25 మందిని పెద్ద ఎత్తున మావోయిస్టుల పేరిట లేఖలు పోస్ట్ ద్వారా చేరవేశారు. ఇంత పెద్ద ఎత్తున ఒకే మండలానికి చెందిన ఎంతమందికి లేఖలు విడుదల చేయడంతో మండలంతో పాటు జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ లేఖల విషయంలో సదరు వ్యక్తి  లేఖలు పంపినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. నర్షింహూలపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో అదే గ్రామంలో ఎక్కువ మందికి లేఖలు పంపడంతో కక్ష సాధింపు చర్యతోనే చేశాడా లేక నిజంగానే మావోయిస్టులు పంపరా అనేది తెలియాల్సి ఉంది.

కానీ కానీ ఇందులో ఒకరే పాల్గొన్నారా,లేక ఎంతమంది ఉన్నారు అనే విషయంలో సమగ్ర విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా పోలీసుల అదుపులోని అనుమానితుడు గతంలో గొల్లపల్లి మండలంలోని పెట్రోల్ బంక్ లో తపంచా తో పెట్రోల్ బంక్ యజమాని డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు వ్యక్తి పై పలు కేసులు ఉన్నట్లు సమాచారం. అక్రమాలకు పాల్పడితే శిక్షించండి. కోమన్ పెళ్లి సర్పంచ్ రమేష్. గ్రామాల్లో ఎలాంటి ఆక్రమాలకు పాల్పడిన ఎలాంటి శిక్షలు విధించిన ఒప్పుకుంటామని కోమనపల్లి సర్పంచ్ శ్రీపతి రమేష్ అన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించడం గాని అమ్మడం గాని చేయలేదని అలా చేసినట్లు నిరూపించినట్లయితే ప్రజాక్షేత్రంలో ఎలాంటి శిక్షలకు అయినా మేము సిద్ధమని సర్పంచ్ రమేష్ అన్నారు.