రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందించాలి అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన బీజేపీ నేతలు

రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందించాలి  అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన బీజేపీ నేతలు

ముద్రన్యూస్ రేగొండ: గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతన్న జీవితం ఆగం అవుతోందని ఆరుగాలం కష్టించి పండించిన పంటలు చేతికందిక రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుని పరిస్థితి ఏర్పడిందని. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వడగళ్ల వర్షానికి దెబ్బ తిన్న పంటలకు నష్ట పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు దాసరి తిరుపతి రెడ్డి, జిల్లా అధ్యక్షులు పొలుసాని తిరుపతి రావు లు డిమాండ్ చేశారు.బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గూడేపల్లి, కొడవటంచ, రామన్న గూడెం తండా , కాకర్ల పల్లి,గ్రామాల్లో దెబ్బతిన్న వరి మొక్కజొన్న మిర్చి పంటలను పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని చెప్పి రాష్ట్రంలో ని మంత్రుల బృందం రేగొండ మండలం లో పర్యటించి ఇప్పటి వరకు రైతులకు ఒక్క రూపాయి కూడా పరిహారం చెల్లించలేదని అన్నారు.కేసీఆర్ ప్రభుత్వం రైతులను మాయ మాటలు చెప్పి మభ్యపెడుతున్నారని అన్నారు.ఈసారి రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈకార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు దాసరి తిరుపతి రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా పొలుసాని తిరుపతి రావు,కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు గన్ రెడ్డి లింగారెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు మోత్కుపల్లి బుచ్చిరెడ్డి,బీజేపీ సీనియర్ నాయకుడు గైని విజేందర్,కొడవటంచ గ్రామ బూత్ అధ్యక్షులు నరేంద్రుల రజినీకాంత్, రాజన్న,వీరన్న,కర్నాకర్, నరేష్,రంజిత్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.