వారిని తొలగించకుంటే పార్టీకీ రాజీనామా చేస్తాం..

వారిని తొలగించకుంటే పార్టీకీ రాజీనామా చేస్తాం..
  • ఎమ్మెల్యే గండ్ర‌కు షాకిచ్చిన కౌన్సిల‌ర్లు.. 
  • భూపాలపల్లిలో కొత్త మలుపులు తిరుగుతున్న రాజకీయం..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:  భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట ర‌మ‌ణారెడ్డికి సొంత పార్టీకి చెందిన మునిసిపల్ కౌన్సిల‌ర్లు షాకిచ్చారు. మునిసిపాలిటీ చైర్మన్ సెగ్గం వెంక‌ట రాణి, వైస్ చైర్మ‌న్ కొత్త హ‌రిబాబుల‌ను ప‌దవుల నుంచి తొల‌గించాలని, లేకుంటే తాము బీఆర్ఎస్ పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తామ‌ని బుధ‌వారం ఎమ్మెల్యేను క్యాంప్ ఆఫీసులో క‌లిసి వినతిపత్రం అందించారు. అయితే కౌన్సిల‌ర్ల డిమాండ్‌ను ఎమ్మెల్యే అంగీక‌రించలేదు. విన‌తిప‌త్రం  తీసుకునేందుకు నిరాక‌రించారు. బుధవారం చ‌ర్చ‌లు కొన‌సాగించిన కౌన్సిల‌ర్లు త‌మ డిమాండ్ నుంచి వెనక్కి త‌గ్గ‌లేదు. సొంత పార్టీలోని కౌన్సిలర్ లు తిరుగుబాటు చేయడంతో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్లు సమాచారం.