అన్ని మతాలను గౌరవించే ప్రభుత్వం బీఆర్ఎస్

అన్ని మతాలను గౌరవించే ప్రభుత్వం బీఆర్ఎస్
  • బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య 
  •  600 మంది ముస్లింలకు దుస్తుల పంపిణీ

 ముద్ర,ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల విద్యాధికారి కార్యాలయం ఆవరణలో బుధవారం ఎల్లారెడ్డిపేట మండలంలోని 600 మంది నిరుపేద ముస్లింలకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు మండల తాసిల్దార్ జయంతి కుమార్ లు కలిసి రంజాన్ కనుక దుస్తుల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు తాసిల్దార్ జయంతి కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య హాజరై మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత పేద ముస్లింలు అందరికీ రంజాన్ పండుగ సందర్భంగా దుస్తులు పంపిణీ చేయడం అదేవిధంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులు కేవలం తెలంగాణ  ప్రభుత్వమే  ఇస్తుందన్నారు. అదేవిధంగా  క్రైస్తవులకు క్రిస్మస్ పండగ సందర్భంగా వారికి కూడా దుస్తుల పంపిణీ చే‌స్తుందన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా  మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

 తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలను అన్ని మతాలను సమాన స్థాయిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో అన్ని రకాల కార్యక్రమాలు దేవాలయాల నిర్మాణాలు, ముస్లీం మైనార్టీల కోసం షాదిఖానలు  కభర్ స్థానాలు మజీద్ లు , ఈద్గాలు  క్రైస్తవుల కోసం ప్రార్థన  మందిరాలు, అన్ని కులాల కోసం కుల సంఘ భవనాలు మంజూరు చేస్తూ సమానంగా చూసే బి ఆర్ ఎస్ ప్రభుత్వం అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో 50, లక్షల రూపాయలు ఖర్చు చేసి షాది ఖానా నిర్మించుకోవడం జరిగిందని మిగతా పనులను పెద్దలు శ్రద్ధ తీసుకొని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో నిధులుమంజూరు చేయించుకుని అది పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. అనంతరం ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అన్నారు. మనం ఎన్నో ప్రభుత్వాలను చూసాం  ముఖ్యమంత్రి కేసిఆర్ ను మరోసారి ఆశీర్వదించాలని ఆమె కోరారు.

మండల కో ఆప్షన్ సభ్యులు జబ్బర్ మాట్లాడుతూ  ముస్లింలకు రంజాన్ పండుగ సందర్భంగా  దుస్తుల సంఖ్యా  పెంచాలని ఆయన కోరారు. సభలో పాల్గొన్న జెడ్పి కోఆప్షన్ సభ్యులు చాంద్ పాషా , జడ్పీటీసీ సభ్యులు చీటీ లక్ష్మణరావు,  సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, ఎఏం సి మాజీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ , సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు కొండాపురం బాల్ రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు జబ్బర్, ఎంపీటీసీ సభ్యులు పందిళ్ళ నాగరాణి,  ఎలగందుల అనసూయ , బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, సింగారం ఉపసర్పంచ్ ఉస్మాన్ బాయి రంజాన్ మాసం గురించి మాట్లాడుతూ  రంజాన్ పండుగను ముస్లీం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. ముస్లిం లకు  రంజాన్ పండుగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ఎంపీటీసీ సభ్యులు సర్పంచులు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ముస్లిం మైనార్టీ సోదరులు ముస్లీం  మహిళలు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.