నిరుద్యోగులను మోసం చేస్తున్న కేసీఆర్. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి

నిరుద్యోగులను మోసం చేస్తున్న కేసీఆర్. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి

మెట్‌పల్లి ముద్ర:- నిరుద్యోగ యువతను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబం గత 10 పది సంవత్సరాలుగా మోసం చేస్తూనే వస్తుందని.నిరుద్యోగ యువతకు 3 వేల 16 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కేసీఆర్ మాట తప్పాడని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ భృతి ఇస్తామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి అన్నారు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ లో భాగంగా చేపట్టిన యువ పోరాట యాత్ర శనివారం కోరుట్ల నియోజకవర్గం లోని మెట్‌పల్లి పట్టణానికి చేరుతుంది. ఈ యాత్రకు కాంగ్రెస్ నాయకులు కోమిరెడ్డి కరంచంద్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు నివాసం వద్ద కొమిరెడ్డి రాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం పట్టణంలో పాదయాత్ర నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో శివసేన రెడ్డి మాట్లాడుతూ.

తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు కోసం ఎందరో ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరుల త్యాగాలను గుర్తించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రాబందులు రాజ్యమేలుతున్నారని. పోరాటాలతో ఏర్పడ్డ తెలంగాణలో కేసీఆర్ కుటుంబా నడుస్తుందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక అల్లాడుతుంటే. మరోవైపు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి జరిగింది లేదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో విసిగిపోయిన ప్రజలు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టనున్నారని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే. రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటును అందిస్తామని. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని. రైతులకు రైతుబంధు తో పాటు రైతు బీమా వర్తింప చేస్తామని. వికలాంగులు ఇతర పెన్షన్ దారులకు 4 వేల రూపాయల పెన్షన్ను అందజేస్తామని హామీ ఇచ్చారు. 2009 ఎన్నికలకు ముందు స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ముఖ్యమంత్రి కేసీఆర్ లు ఇక్కడి ప్రాంత రైతులకు మూసివేసిన షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో తొక్కారని. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి ఇక్కడి ప్రాంత రైతులతో పాటు, ఉద్యోగాలు కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు తెస్తానని పసుపు రైతులకు హామీ ఇచ్చాడని. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయాడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పసుపు బోర్డు ఏర్పాటు చేసి పసుపు రైతులకు గిట్టుబాటు ధర అందిస్తామని తెలిపారు. ఈ యాత్రలో జగిత్యాల జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గుండ మధు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామ్రాట్ వంశీ ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమిరెడ్డి విజయ్ ఆజాద్, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఎర్రోళ్ల హనుమాన్లు యాదవ్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు వాకిటి సత్యం రెడ్డి, వార్డ్ కౌన్సిలర్ లు యామరాజయ్య, ఎండి షాకీర్, న్యాయవాది సురభి అశోక్, ఎండి రైసుద్దీన్, కటకం గంగారెడ్డి, వంగ అశోక్ యాదవ్, అంబటి హనుమాన్లు, కటకం చంద్రశేఖర్, కడకుంట్ల గంగాధర్, ఎండి జాకీర్,  కృష్ణమూర్తి, బత్తుల ప్రసాద్, అజారుద్దీన్, ఆసిఫ్, అల్లూరి లింగారెడ్డి, పెంట ప్రణయ్, కాజా అజీమ్, ఎండి రజాక్, బర్ల అర్జున్, పొట్ట గోపి, బర్ల వంశీ, కంతి హరికుమార్ పల్లికొండ ప్రవీణ్, గణేష్, షేర్ భరత్, విజయ్ పాటిల్, పుల్కం శివ, లక్ష్మణ్, భీమయ్య, శ్రీ వర్ధన్, సింగని మారుతి, కోటగిరి సిద్ధార్థ, తదితరులు పాల్గొన్నారు.