కొండగట్టు లో ఘనంగా చిన్న హనుమాన్ జయంతి వేడుకలు...

కొండగట్టు లో ఘనంగా చిన్న హనుమాన్ జయంతి వేడుకలు...

ముద్ర, మల్యాల: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రంలో చిన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా గర్భాలయాన్ని అందంగా ముస్తాబు చేసి, స్వామివారి  మూలవీరాట్టును ప్రత్యేకంగా అలంకరించారు. అంతకు ముందు స్వామివారికి ప్రత్యేక అభిషేకలు నిర్వహించారు. సందర్భంగా సింధూర ప్రాంతాల నుంచి వచ్చిన హనుమాన్ దీక్ష స్వాములు మాల వీరమన చేసి స్వామివారిని దర్శించుకున్నారు.   ఈ కార్యక్రమంలో స్థానాచార్యులు కపీందర్, ప్రధాన అర్చకులు జితేంద్ర ప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి, మారుతి ప్రసాద్, ఆలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మండలంలో...
హనుమాన్ చిన్న జయంతి వేడుకలు మల్యాల మండలంలో గురువారం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లోని ఆంజనేయస్వామి ఆలయాలను అందంగా ముస్తాబు చేసి, ప్రత్యేక పుజాలు, అన్నదానం కార్యక్రమాలు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు