ప్రతి నష్టపోయిన రైతును ఆదుకుంటాం-మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే రవిశంకర్

ప్రతి నష్టపోయిన రైతును ఆదుకుంటాం-మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే రవిశంకర్

ముద్ర, మల్యాల: అకాల వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మండలంలో పర్యటించి, నష్టం వాటిల్లిన పొలాలు పరిశీలిoచారు. అలాగే రైతులతో మాట్లాడి వారికి దైర్యం కల్పించారు. ఏ ఒక్క రైతు కూడా మిస్ కాకుండా నష్ట వివరాలు ప్రభుత్వంకు సమర్పించాలని వ్యవసాయ శాఖ ఏడీఏ సురేష్ కుమార్, ఏవో చంద్రదీపక్ లకు ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ ఎవరెన్ని విమర్శలు చేసిన తమది రైతు ప్రభుత్వమని, దేశంలోనే ఎక్కడలేని విధంగా ఒక్క తెలంగాణలోనే  రైతులకు అనేక పథకాలు అమలవుతున్నాయన్నారు. కాగా, ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మండలంలోని మద్దుట్ల, గొర్రెగుండం గ్రామాల నష్టపోయిన రైతులకు దాదాపు 30 లక్షల పరిహారం రెండు, మూడు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాలాలో జమ అవుతాయని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.

బాధిత కుటుంబానికి పరమార్శ

బుధవారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మల్యాలలో అగ్నిప్రమాదం జరిగిన బట్టల దుకాణంను సందర్శించి, బాధిత కుటుంబాన్ని పరమార్శించారు. ఈ సందర్బంగా ఘటనకు సంబందించిన కారణాలు షాప్ యజమానిని అడిగితెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్, మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జనగాం శ్రీనివాస్, సింగిల్ విండో అధ్యక్షుడు బోయిన్ పల్లి మధుసూదన్ రావు, ఆగంతపు వంశీ, గడ్డం రాజేశ్వర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు