సీఎం కప్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన అనిల్

సీఎం కప్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన అనిల్

కేసముద్రం, ముద్ర: సీఎం కప్ క్రీడా పోటీల్లో భాగంగా మాహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి పోటీల్లో ఇనుగుర్తి మండలంలోని అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన భూక్య అనిల్ 100 మీటర్ ల రన్నింగ్ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడని ఇనుగుర్తి పిఈటి, క్రీడా పోటీల ఇంచార్జ్ కొమ్ము రాజేందర్ తెలిపారు. అనిల్  ప్రస్తుతం డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతూ గతంలో కాకతీయ యూనివర్సిటీ స్థాయి పోటీల్లో పాల్గొని అనేక విజయాలు సాధించాడు. జిల్లాస్థాయి పోటీల్లో ఇనుగుర్తి మండలం తరఫున తొలిసారి పాల్గొని గోల్డ్ మెడల్ సాధించిన అనిల్ ను ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ రెఫరీ కొమ్ము రాజేందర్ తో పాటు, ఇనుగుర్తి గ్రామ సర్పంచ్ దార్ల రాంమూర్తి, అయ్యగారిపల్లి సర్పంచ్ మామిడి శోభన్ బాబు ఇరు  గ్రామ ప్రజలు అభినందించారు.