క్రీడలలో యువతీ యువకులు రాణించాలి 

క్రీడలలో యువతీ యువకులు రాణించాలి 

ముద్ర ,మఠంపల్లి: క్రీడలలో యువతి యువకులు రాణించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడాఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు క్రీడాఉత్సవాలు ప్రారంభించారని మఠంపల్లి యం పి పి మూడవత్ పార్వతి కొండానాయక్ తెలిపారు. సోమవారం మండల కేంద్రమైన మఠంపల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సి యం కప్ పోటీలలను యం పి పి యం కొండానాయక్ ప్రారంభించారు.ఈయొక్క పోటీలు మంగళవారం, బుధవారం కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా కొందరు పి ఈ టి లు కార్యక్రమానికి వచ్చిన అతిధుల టోకెన్లను తమ మిత్రులకు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వివరణ:దీనిపై యం పి డి ఓ ను వివరణ కోరగా అలాంటిదేమీ జరగలేదని పేర్కొన్నారు.