మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం

మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం
  • మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో గందరగోళం

ముద్ర ప్రతినిధి, నల్గొండ/మునుగోడు: మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేఅభ్యర్థికోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.ఆదివారం మునుగోడు మండల కేంద్రంలో మునుగోడు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ, కుటుంబ పాలన అంతం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనివారు అన్నారు. బిజెపి,బిఆర్ఎస్ కుమ్మక్కై, కవితను అరెస్టు చేయకపోవడం అంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. అవినీతి రాజ్యమేలుతున్నబిఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో తగిన గుణపాఠం చెప్పాలనివారు అన్నారు. కన్నతల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ అని, తెలంగాణ రాష్ట్రంలోకాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసంకృషి చేస్తాననివారు అన్నారు. మునుగోడుకు రాజగోపాల్ రెడ్డికాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అయితే టికెట్ ఇచ్చారో అప్పుడే ముఖ్యమంత్రి గుండెల్లో గుబులు మొదలైంది అన్నారు.మునుగోడు అభివృద్ధి నా రాజీనామా తోనే చండూరు రెవిన్యూ డివిజన్, డబల్ రోడ్లు, గట్టుపల్ మండలం  అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. మునుగోడు ప్రజలు ఎల్లప్పుడూనా వెంటే ఉన్నారని, నన్ను ఎప్పుడు మర్చిపోలేరని  లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తారనివారు భీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బిఆర్ ఎస్ ప్రభుత్వంవందమంది ఎమ్మెల్యేలను, మంత్రులనురంగంలో దింపిననాకు మునుగోడు ప్రజలు 87 వేల ఓట్ల మెజార్టీని నాకు ఇచ్చారని. నైతికంగా నేనే గెలిచాననివారు అన్నారు. అందరం కాంగ్రెస్ పార్టీ కోసం కలిసి పని చేయాలని, మన మధ్యన ఎటువంటి పొరపాటులు ఉండకూడదనివారు అన్నారు.

కేసీఆర్ కుటుంబ అవినీతిపై అమిత్ షాను డైరెక్ట్ గా అడిగితే ఎలాంటి సమాధానం రాలేదని వారు అన్నారు. అవినీతికి పాల్పడుతున్న కెసిఆర్ కుటుంబం పై బిజెపి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అప్పుడే నా సొంత గూటికి రావాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. మునుగోడు ప్రజల అదృష్టం మేరకు ఈ ప్రాంత ప్రజలు కాంగ్రెసులోకి రావాలని నన్ను కోరుకున్నారని అందుకే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని, అందుకే మునుగోడు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకిసాధ్యమవుతుందని అన్నారు. రాజగోపాల్ రెడ్డి ని ఎదుర్కోవాలంటే బలం సరిపోక కమ్యూనిస్టుల కాలమొక్కి ఉప ఎన్నికల్లో కెసిఆర్ గెలిచారని వారు అన్నారు. ఆనాడు ఎంపీగా ఉన్న నన్ను పార్లమెంటుకు పంపిస్తే  తెలంగాణ గొంతు వినిపించి, తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి చాలా కష్టపడ్డామని, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను కెసిఆర్ కుటుంబం చేతిలో నలిగిపోతున్నదని, కెసిఆర్ ను గద్దె దించే వరకు పోరాడతాననివారు అన్నారు. మునుగోడు నియోజకవర్గ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కూసుకుంట్ల 100 సార్లు వచ్చిన, నేను ఒకసారి వచ్చిన ఒకటేనని  వారు అన్నారు. నేను మునుగోడు కు వచ్చాను అంటే నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయాలని ఆలోచిస్తాను కానీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వచ్చిండంటే ఎక్కడ పంచాయతీలు పెట్టాలి, ఎక్కడ కబ్జాలు చేయాలని ఆ పనిలో ఉంటాడని  వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాకు రాజకీయ జన్మనిచ్చిందని ఇదే నా సొంత ఇల్లు అని నేను మళ్ళీ తిరిగి కాంగ్రెస్ లోకి వస్తే తప్పేంటని వారు అన్నారు. అమ్ముడుపోయిన వ్యక్తిని  అయితే కాంగ్రెస్ లోకి ఎలా వస్తా? అమ్ముడుపోయానని నాపై ఆరోపణలు  చేసిన వ్యక్తులకు ఒకటి చెప్తున్న నన్ను కొనే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు అని వారు సవాల్ విసిరారు. ఏ రాజకీయ సంచలనం  జరగాలన్న... రాజకీయ పేను తుఫాను రావాలన్న మునుగోడు గడ్డమీది నుండే  జరుగుతుందన్నారు. అభివృద్ధి అంటేసిరిసిల్ల, సిద్దిపేట అభివృద్ధి చేస్తేరాష్ట్రమంతా అభివృద్ధి చేసినట్లేనా అని ప్రశ్నించారు.

సభా వేదికపై పేర్లు పిలిచే క్రమంలో సమావేశంలో గందరగోళం

రాజగోపాల్ రెడ్డి మాట్లాడక ముందే   సభ వేదికఫై పిలిచే క్రమంలో మా పేర్లు ఎందుకు పిలవడం లేదని కొంతసేపు ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఆ తర్వాత పాల్వాయి స్రవంతి సముదాయించడంతో పాల్వాయి స్రవంతి  అనుచరులను ఆమె శాంతింప చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్నకైలాష్ నేత ఫోటో సభా వేదికపై ఉన్న  ఫ్లెక్సీలో ఫోటో లేకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆశ్చర్యపోయారు.  అనంతరం కొంతసేపు ఘర్షణ  వాతావరణంనెలకొన్నప్పటికీ చివరి నిమిషంలో సమస్య సద్గుణమైంది.ఈ కార్యక్రమంలోమునుగోడు నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి, ఏఐసిసి సభ్యుడు నిర్ల కంటి ( పీకే), కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పున్న కైలాస్ నేత, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్వాయి స్రవంతి, చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డి, కుంభం శ్రీనివాస్ రెడ్డి, వేంరెడ్డి సురేందర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులుకోడి గిరిబాబు,పల్లె వెంకన్న, దోటి వెంకటేష్ యాదవ్, మంచుకొండ సంజయ్, పన్నాల లింగయ్య,  పొలగోని సత్యం,  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు,సర్పంచులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.