సర్పంచ్ శ్రమదానం!

సర్పంచ్ శ్రమదానం!

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో ఉప్పరపల్లి చౌరస్తా వద్ద ఆర్ అండ్ బి రోడ్డు దెబ్బతిని నీరు నిలిచి చిన్న కుంట ఏర్పడింది. చిన్నపాటి వర్షానికి కూడా అక్కడ నీరు చేరి వాహనాల రాకపోకల తో పాటు పాదచారులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. రోడ్డు దుస్థితిపై అనేక పర్యాయాలు ఆర్ అండ్ బీ అధికారులకు ఈ విషయంపై ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో స్వయంగా సర్పంచ్ బట్టు శ్రీనివాస్ ఆదివారం శ్రమదానంతో దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మత్తులు నిర్వహించాడు. నీరు నిలవకుండా సిమెంటు పైపులు వేయించి రోడ్డుకు మరమ్మత్తులు చేయిస్తానని సర్పంచ్ తెలిపాడు.