రైతు బంధుపై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ని నమ్మొద్దు..

రైతు బంధుపై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ని నమ్మొద్దు..
  • రైతుల పట్ల కాంగ్రెస్ కి ఎంత ప్రేమ ఉందో ఓటర్లు అర్థం చేసుకోవాలి...
  • కాంగ్రెస్ కి ఓటు వేస్తే ప్రజలు వారి కళ్ళ లో వారే పొడుచుకున్నట్లు : కంచర్ల రామకృష్ణారెడ్డి

ముద్ర ప్రతినిధి భువనగిరి:రైతు బంధుపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందని, రైతుల పట్ల కాంగ్రెస్ కి ఎంత ప్రేమ ఉందో ఓటర్లు అర్థం చేసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారంబి ఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం లో ఎమ్మేల్యే శేఖర్ రెడ్డితో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.....

రభి లో రైతు బంధు ఇస్తే  ఎన్నికల్లో మాకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ ఫిర్యాదు చేయడంపై రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ కి ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు. రైతులు ఒక్క సారి ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. 2014 ముందు రైతు ఆత్మ హత్యలు ఎలా ఉన్నాయి, తెలంగాణ వచ్చిన తరువాత సాగు నీటి ప్రాజెక్టు లు పూర్తి అయి, రైతుల ఆత్మ హత్యలు పూర్తి గా తగ్గాయని చెప్పారు.రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటల కరెంట్ చాలు, అంత కంటే రైతులకు అవరసం లేదని  చెప్పడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బందు అవసరం లేదనడం రైతులు అర్థం చేసుకోవాలన్నారు.కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డి కె శివ కుమార్ తమ రాష్ట్రం లో రైతులకు 5 గంటల ఇస్తున్నామని అంటున్నారు. కానీ తెలంగాణ లో 24 గంటల కరెంట్ ఇస్తుందని చెప్పారు. 

కాంగ్రెస్ లో సీట్ల పంపకాలు ఇంకా తేగలదు. వీరు తెలంగాణ రాష్ట్రం లో ఉద్దరిస్తారా? అని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద ఉందని కాంగ్రెస్ పార్టీ వారు చెప్పే మాటలు ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు.దుబ్బాక బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ ప్రచారం లో ఉంటే ఓ కార్యకర్త కత్తి తో దాడిని ఖండించారు.మీ ప్రచారం మీ రు చేసుకోండి అంటూ ప్రతి పక్ష పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ భౌతిక దాడులకు దిగితే సహించేది లేదన్నారు.కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేస్తే ప్రజలు వారి కళ్ళ లో వారే పొడుచుకున్నట్లు అన్నారు.బిజెపి వాళ్ళు బి సి లకు ముఖ్య మంత్రి ఇస్తా అంటున్నారని పార్టీ కి బి సి అధ్యక్షుడు ఉంటే మార్చేస్తున్నారు. ఇది మీ చిత్త శుద్ధి అని ప్రశ్నించారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో 12 సీట్లు బి ఆర్ ఎస్ గెలుచు కుంటుందని ధీమా వ్యక్తం చేశారు. భువనగిరి ఎమ్మేల్యే శేఖర్ రెడ్డి మాట్లాడుతూతెలంగాణ వచ్చిన తరువాత అభివృధి కార్యక్రమాలు జరిగాయన్నారు.గతంలో యాదాద్రి జిల్లా ఎడారి లా ఉండేదని ఇప్పుడు పంటలు పచ్చదనం తో ఉన్నాయన్నారు.కాంగ్రెస్ పార్టీ చెప్పే మాయ మాటలు వినకుండ ఆలోచించి ఓటు వెయ్యాలని లేదంటే చాలా నష్ట పోతామన్నారు.రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి జరుగుతుందన్నారు.త్రి బుల్ ఆర్ అలైన్ మెంట్ కేంద్ర పరిధి లో ఉందని రైతుల భూమి పోతే నాకూ బాధగా ఉందన్నారు. రాయగిరి రైతులు అపోహలకు పోవద్దన్నారు.ఎం ఎల్ ఏ కి , త్రి బుల్ ఆర్ కి సంబందం లేదన్నారు.రైతులు నష్టపోకుండా చూస్తానని హామీ ఇచ్చారు.

ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్ష మయ్య గౌడ్ మాట్లాడుతూ ...

బి జెపి తరపున పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ప్రజలు నమ్మొద్దు అన్నారు. నోటుకు ఓటు కేసు లో రేవంత్ రెడ్డి ఉన్నారని  వాళ్ల పదవుల కోసం కాంగ్రెస్ రాజకీయ లు చేస్తుందన్నారు.దుబ్బాక లో కాంగ్రెస్ పార్టీ దాడులకు పాల్పడుతున్నారని ప్రజలు ఆలోచించి కారు గుర్తుకు ఓటు వేసి బి ఆర్ ఏస్ ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్ గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా చైర్మన్ కొలుపులు అమరేందర్ పాల్గొన్నారు.