బీఆర్ఎస్ లో చేరిన కొత్త జైపాల్ రెడ్డి, బీజేపీ కార్పొరేటర్లు

 బీఆర్ఎస్ లో చేరిన కొత్త జైపాల్ రెడ్డి, బీజేపీ కార్పొరేటర్లు
  • పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి కెసిఆర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో తెలంగాణ భవన్ లో కాంగ్రెస్ సీనియర్ నేత కొత్త జయపాల్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీనితోపాటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇద్దరు బిజెపి కార్పొరేటర్లు కచ్చు రవి, మర్రి భావన, బిజెపి నేత మర్రి సతీష్ లు సైతం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

మంత్రి గంగుల కమలాకర్  బుధవారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ తో బేటీ అయ్యారు. అనంతరం నియోజకవర్గ ఎన్నికల స్థితిగతులపై చర్చించారు. పార్టీలో చేరిన నేతలు మాట్లాడుతూ పార్టీ భలోపేతానికి కృషి చేయడంతో పాటు రాబోయే రోజుల్లో కరీంనగర్ అభివృద్దిలో పాలుపంచుకోవడానికి తమ శాయశక్తులా కృషిచేస్తామని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు కరీంనగర్ పట్టణ అధ్యక్షులు చల్లా హరిశంకర్ నాయకులు గంగుల ప్రదీప్, కర్ర సూర్య శేఖర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.