భౌతిక దాడులతోనే అధికార లక్ష్యం అని ఏ పార్టీ బావించదు - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

భౌతిక దాడులతోనే అధికార లక్ష్యం అని ఏ పార్టీ బావించదు - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

దాడి రాజకీయ కుట్ర అయితే ఆ పార్టీకే నష్టం - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఎంపి ప్రభాకర్ రెడ్డి పై జరగిన దాడి రాజకీయ కుట్ర అయితే ఆ పార్టీకే నష్టం జరుగుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని 25 వార్డులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇందిరా గాంధీ వర్ధంతి నిర్వహించి, ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్బంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ భౌతిక ధాడులతోనే అధికార లక్ష్యమని ఏ పార్టీ భవించదని, అది కీడును తీసుకొస్తుందని అన్నారు. తెలిసి ఎవరు భౌతిక దాడులకు పాల్పడరని, ఏ పరిస్థతుల్లో దాడి చేశారో విచారణలో బయటకు వస్తుందన్నారు. దాడి చేసిన వ్యక్తి జర్నలిస్టు అని తెలిసిందని, జర్నలిస్టులు ఇంత అక్రోషంగా ఉన్నారంటే ఎవరు జవాబు చెప్పాలని ప్రశ్నించారు. పాత్రికేయులు అంటే బి ఆర్ ఎస్, బి జే పీ, కాంగ్రెస్.. అన్ని రాజీయపార్టీలతో సంబంధాలు కలిగి ఉంటారని అన్నారు. నేను లేకుంటే తెలంగాణ లేదు అని సిఎం కేసీఆర్ పేర్కొనడం హాస్యాస్పదం అన్నారు. తెలంగణ ఉద్యమానికి వూతం ఇచ్చింది విద్యార్ధులు, నిరుద్యోగ యువత.. వారి బలిదానాలు అని, ఒకరి కోసం తెలంగాణ కాదు ఏ సమాజం ఆగదన్నారు. కేసీఆర్ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాడు. పెట్టుబడిదారీ వర్గా నియంతృత్వ ధోరణికి అద్దం పడుతుందన్నారు. రాజు లేకపోతే రాజ్యం ఆగదు.. మీరు నిర్మించిన  కాలేశ్వరం ప్రాజెక్టు ఏమైంది నాలుగేళ్లు నిలవలేదన్నారు. నాడు నిర్మించిన కడెం ప్రాజెక్టుపై నీళ్ళు పొంగిపొర్లిన చెక్కుచెదరలేదని అన్నారు. ఉద్యమ భాగస్వామిగా నీకు పదేళ్లు అవకాశమిచ్చారు.. ఇంతకంటే ఏమి కావాలని ప్రశ్నించారు. ఉన్నోడికి బంగారు తెలంగాణ అని లేనోడికి ఉపాధి బుక్కెడు అన్నం కావాలి ఆ దిశగా ఆలోచించాలి అన్నారు. ఏ రాజకీయ పార్టీ వచ్చిన సామాజిక తెలంగాణ నిర్మాణం కావాలని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సామాజిక తెలంగాణ నిర్మిస్తుంది అని పేర్కొన్నారు.