ఈరోజుతో ముగియనున్న కవిత జ్యూడీషల్ కస్టడీ....కోర్ట్ తీర్పు పై తీవ్ర ఉత్కంఠ

ఈరోజుతో ముగియనున్న కవిత జ్యూడీషల్ కస్టడీ....కోర్ట్ తీర్పు పై తీవ్ర  ఉత్కంఠ

ముద్ర,తెలంగాణ:- మద్యం పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యూడీషల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఆమెను ఈరోజు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కాకుండా నేరుగా న్యాయస్థానంలోనే విచారించాలని కవిత వేసిన పిటిషన్‌కు కోర్టు అనుమతించింది.

ఇదిలాఉండగా.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత.. ఈడీ, సీబీఐ కేసుల్లో వేరువేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని ఆమె తెలిపారు. మహిళగా పీఎంఎల్‌ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్‌కు అర్హత ఉందని చెప్పారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కవితకు పిటిషన్లను తిరస్కరిస్తూ బెయిల్ ఇవ్వలేదు. ఆమె బెయిల్ నుంచి బయటకు వస్తే.. సాక్ష్యాలను తారుమారు చేస్తారనే అనుమానంతో కోర్టు బెయిల్‌కు నిరాకరించింది.