వనపర్తి జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు

వనపర్తి జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
  • జిల్లా ఎస్పీ శ్రీమతి రక్షిత కె మూర్తి

ముద్ర.వనపర్తి:- జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు (ఫిబ్రవరి 1వ తేది నుండి 29 వరకు) జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా యస్పి రక్షిత కె మూర్తి  ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేనిది వనపర్తి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా, ప్రజా ధనానికి నష్టం కల్గించే, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదన్నారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఇట్టి విషయంలో పోలీసు వారికి సహకరించవలసిందిగా సూచించారు.అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.