చీఫ్ ప్రమోటర్ గా నీల రాజు

చీఫ్ ప్రమోటర్ గా నీల రాజు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్న పెండ్యాలకు చెందిన నీల రాజు జనగామ జిల్లా ఫిషరీస్ చీఫ్ ప్రమోటర్ గా నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, జనగామ జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు నీల గట్టయ్య ఆధ్వర్యంలో జిల్లా ఫిషరీస్ ప్రమోటర్ల నియామకం జరిగింది.

చీఫ్ ప్రమోటరుగా నీల రాజు అలాగే ప్రమోటర్స్ గా చిక్కుడు రాములు, బూర్ల శంకర్ యాట రాజకుమార్, నిమ్మల స్వామి, వద్ది వెంకటయ్య, మడికండి కుమారస్వామి, తుపాకుల సంపత్, మారబోయిన సత్తయ్య, పిట్టల రాజు, బోళ్ల రాఘవులు ఎన్నిక జరిగింది. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి పల్లెబోయిన అశోక్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు బుస్సా మల్లేశం, నీలగట్టయ్య తదితరులు పాల్గొన్నార