ఉద్యమకారులను విస్మరిస్తే పుట్టగతులు ఉండవు

ఉద్యమకారులను విస్మరిస్తే పుట్టగతులు ఉండవు
  • తెలంగాణ ప్రగతి సమితి రాష్ట్ర అధ్యక్షుడు చింత స్వామి
  • సెప్టెంబర్ 17న సన్మానం ఉద్యమకారులకు సన్మానం

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: ఎన్నో ఉద్యమాలు, త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారులను మరిస్తే కెసిఆర్ కు పుట్టగతులు ఉండవని తెలంగాణ ప్రగతి సమితి రాష్ట్ర అధ్యక్షులు చింత స్వామి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఉద్యమంలో పాల్గొని ఇప్పటికీ నిరుద్యోగులు కంటనీరు పెడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉద్యమంలో పాల్గొంటే కొంతమందికే పరిమితమైందని తెలంగాణలో ఇప్పటికీ ఆంధ్ర పెత్తనం కొనసాగుతున్నదని ఇలాంటివారు సెప్టెంబర్ 2 వరకు డేట్ లైన్ పెడుతున్నామని చంద్రశేఖర రావు వెంటనే ఇలాంటి వారిని తెలంగాణ నుండి తరిమి వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉద్యమాల చరిత్ర కలిగినటువంటి మండలం తాటికొండ గ్రామంలో సెప్టెంబర్ 17వ తేదీన స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమకారులు, కవులు కళాకారులకు సన్మాన కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న జన్మించిన తాటికొండలో 12 వేల మంది సైన్యంతో ఉద్యమాన్ని చేపట్టిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్నకు దక్కినదని మొగలు సామ్రాజ్యాన్ని కడగడలాడించి ఆదర్శంగా నిలిచాడని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ జడ్పిటిసి గుర్రం యాదగిరి, మాజీ ఎంపీటీసీ   పాతీ కుమార్, గట్టు శ్రీనివాస్,  తెలంగాణ ఉద్యమకారుడు పార్శి రంగన్న, సమ్మయ్య, పులి శ్రీనివాస్  పలువురు పాల్గొన్నారు.