దశలవారీగా శిక్షణ ఇవ్వాలి

దశలవారీగా శిక్షణ ఇవ్వాలి
  • జిల్లా కలెక్టర్ శివలింగయ్య

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి దశలవారీగా శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆదేశించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఇతర సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రిటర్నింగ్ అధికారులు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులు కల్పన, ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బందికి శిక్షణ తరగతులు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి దశలవారీగా శిక్షణ తరగతులు నిర్వహించాలని తెలిపారు. రిటర్నింగ్ అధికారుల కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ఎన్నికలకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, లలో స్ట్రాంగ్ రూమ్ భద్రతా చర్యలు, కావలసిన ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి పనిని తక్షణమే పూర్తి చేసి రోజువారి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, జిల్లా సహాయ ఎన్నికల అధికారిని సుహాసిని, ఎన్నికల ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్ అనిల్ కుమార్, సిపిఓ ఇస్మాయిల్, డి ఆర్ డి ఓ మొగులప్ప, డిపిఓ రంగాచారి, జనగామ ఆర్ఓ మురళీకృష్ణ, స్టేషన్ ఘన్పూర్ ఆర్వో రామ్మూర్తి, మాస్టర్ ట్రేనర్స్ రామరాజు, సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.