చర్మ కార్మికులకు 5 వేల పెన్షన్ ఇవ్వాలి

చర్మ కార్మికులకు 5 వేల పెన్షన్ ఇవ్వాలి
  • రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాదే కుమార్

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: చర్మకారులకు వయసుతో నిమిత్తం లేకుండా నెలకు రూ.5 వేల పెన్షన్, 3 గుంటల నివాస స్థలాన్ని కేటాయించాలని తెలంగాణ చర్మకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాదె కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనంతపురం చంద్రమౌళి డిమాండ్ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రం అంబేద్కర్ సెంటర్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ బూట్ పాలిష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో మినీ లెదర్ పార్క్ ఏర్పాటు చేసినప్పటికిని పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరింది అన్నారు. వందల సంఖ్యలో శిక్షణ పొందిన చర్మకారులు ఉన్నప్పటికీ వారికి ఉపాధి చూపడంలో కొత్తవారికి శిక్షణ ఇవ్వడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. చర్మకారుల పిల్లలకి ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. చర్మకారులందరికీ మూడు గుంటల నివాస స్థలాన్ని కేటాయించాలని వయసుతో నిమిత్తం లేకుండా రూ. 5 వేల పెన్షన్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గాదె ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు అనంతపురం మల్లేష్, మండల అధ్యక్షుడు జీడి యాకయ్య కార్మికులు సోంపల్లి సుధారాణి, ఇమ్మడి స్వరూప, జయ, దేవరకొండ అరుణ, సోంపల్లి శీను, సోంపల్లి అరుణ్, వెంకటస్వామి, శ్రీనివాస్ ఇతరులు పాల్గొన్నారు.