దుబ్బాక అభ్యర్థి పై కత్తి దాడి అమానుషం

దుబ్బాక అభ్యర్థి పై కత్తి దాడి అమానుషం

ముద్ర జఫర్‌గడ్ : దుబ్బాక బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ పై దాడి చేయడం అమానుషమని మాజీ మార్కెట్ చైర్మన్ అన్నం బ్రహ్మారెడ్డి అన్నారు. జనగామ జిల్లా జఫర్‌గడ్ మండల కేంద్రంలో పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా తహసిల్దార్ కార్యాలయం చేరుకుని వినతి పత్రం అందజేశారు . ఈ సందర్భంగా బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ తీగల కర్ణాకర్ రావు, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు ఎడ్ల వెంకటస్వామి, నియోజకవర్గ నాయకులు ఇల్లందుల శ్రీనివాస్, పెద్దిరెడ్డి, రాజేష్ నాయక్, అన్నెపు అశోక్, కడారి శంకర్, మండల నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.