ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి: రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం

ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి: రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం

 మునుగోడు, ముద్ర: మోడీ కార్మిక కర్షక ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా గ్రామస్థాయి నుండి ఢిల్లీ వరకు ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండశ్రీశైలం అన్నారు. ఆదివారం మర్రిగూడ మండల పరిధిలోని తిరు గండ్లపల్లి గ్రామం లో నీలకంఠం రాములు అధ్యక్షతన సమావేశంజరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రైతాంగం ప్రత్యేకించి ఉత్తర భారత రైతులు ప్రాణాలొడ్డి సాగించిన ఆందోళనలతో దిగివచ్చిన భారత ప్రధానమంత్రి రైతులకు క్షమాపణలు చెప్పి ఒప్పుకున్న డిమాండ్లను నేటికీ అమలు జరగకపోవడంతో దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగంలో ఆందోళన వాతావరణం నెలకొంది పరస్పర విమర్శల తర్వాత కిసాన్ ఆందోళన దశ దిశ గురించి కొన్ని సలహాలను చేసిందని ఆయన అన్నారు కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను రైతు నల్ల చట్టాలను కార్మిక చట్టాలను నాలుగు కోడ్లను విధించిన విధానాలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దానితోపాటు విద్యుత్ సంస్కరణ చట్టాన్ని రాష్ట్రాల యొక్క హక్కులను కాలరాస్తూ ప్రైవేటీకరణ చేయడం కోసం దాన్ని ప్రజల మీద భారాలు మోపడం కోసం సంస్కరణ చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది అని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణమాఫీ వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ధరణిలో జరిగిన భూ సమస్యలను సరిచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతుబంధు రైతు బీమా వాటిని పాస్బుక్కు కలిగిన ప్రతి రైతుకి ఈ పథకాలు వర్తింపజేయా లి మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా మండలానికి మంత్రి గ్రామానికి ఎమ్మెల్యే వచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను సిసి రోడ్లు మురికి కాలువలు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పెన్షన్లు రేషన్ కార్డులు మొదలగు సమస్యలను ప్రజలకు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి నుండి ఎమ్మెల్యే వరకు వాగ్దానం చేశారు ఉప ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య రైతు సంఘం మండల అధ్యక్షుడు కొట్టం యాదయ్య మైల సత్తయ్య చెల్లం ముత్యాలు కాగు వెంకటయ్య చలం నరసింహ సొప్పరి హనుమంతు పెరుమాండ్ల మంజుల పోలేపల్లి రాములు నక్క నరసింహ కంచుకట్ల రాములు పోలే అంజమ్మ మాడుగుల పద్మ జిల్లా అమృత కలకొండ సుజాత చెల్లం పెద్ద లక్ష్మమ్మ చిన్న లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు