సమస్యలపై జర్నలిస్టుల నిరసన ప్రదర్శన

సమస్యలపై జర్నలిస్టుల నిరసన ప్రదర్శన
  • మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్ వినయ్ భాస్కర్ సంఘీభావం

హనుమకొండ : జర్నలిస్టుల డిమాండ్స్ డే ను పురస్కరించుకొని సోమవారం హనుమకొండ జిల్లా కేంద్రంలోని పబ్లిక్ గార్డెన్లో టీయూడబ్ల్యూజే (ఐజేయు) హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో దేశంలో మీడియా రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేసి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన జర్నలిస్టులకు రైల్వే పాసులను పునరుద్ధరించాలని, ఇల్లు ఇళ్ల స్థలాలు అందజేయాలని కోరారు.ఈ సందర్భంగా జర్నలిస్టుల నిరసన కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్,కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ తదితరులు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి,చీఫ్ విప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ  కార్యక్రమంలో ఐజేయు జాతీయ నాయకులు దాసరి క్రిష్ణా రెడ్డి, టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి గాడిపెల్లి మదు, జిల్లా అధ్యక్షులు గడ్డం రాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్, వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వేముల నాగరాజు,బొల్లారపు సదయ్య, మాజీ అద్యక్షులు పిన్నా శివకుమార్, జాతీయ కౌన్సిల్ సభ్యులు నల్లాల బుచ్చిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ పి. విష్ణు వర్దన్,సోమిడి అంజన్ రావు, ఎండీ నయీం, నాయకులు బరిగెల భాస్కర్, బండి పర్వతాలు, వంగ రమేష్ యాదవ్, పులి కంటి రాజేందర్,దండు మోహన్, ఖాదర్ పాషా, ఎండి ఉస్మాన్,తాండూరి గోపి, శాగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టర్ కు టీయూడబ్ల్యూజేే నాయకులు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.