తుంగతుర్తి అభ్యర్థి పరిశీలనలో ముగ్గురు పేర్లు ఉన్నాయా?

తుంగతుర్తి అభ్యర్థి పరిశీలనలో ముగ్గురు పేర్లు ఉన్నాయా?
  • అద్దంకి ,అన్నపర్తి ,ప్రీతం పేర్లు పరిశీలనకు వచ్చాయా?
  • ఇది ఊహగానమా? లేక వాస్తవమా? తేలాల్సి ఉంది
  • అద్దంకి గత ఎన్నికల కోర్టు కేసు అద్దంకి వరంగా మారం ఉందా?
  • మరో మారు అభ్యర్థిగా అద్దంకి వస్తారా?
  • తుంగతుర్తి అభ్యర్థి ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠత
  • సూర్యాపేటలో అభ్యర్థి మారితే దాని ప్రభావం తుంగతుర్తిపై ఉంటుందా?

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరవుతారనే విషయంపై నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది . ఈ నేపథ్యంలో ఈనెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న ఆశావహుల్లో ముగ్గురి పేర్లను ఏఐసీసీకి పంపనున్నట్లు పిసిసి వర్గాలు చెబుతున్నాయి . తుంగతుర్తి నియోజకవర్గం నుండి అనేకమంది ఆశావహులు తమకు టికెట్టు ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా వారిలో మూడు పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది .రెండు రోజులుగా వినిపిస్తున్న పేర్లు వాస్తవమా లేక నిజంగానే ఊహాగానమా? అనేది చర్చనీయాంశంగా మారింది . గత రెండుసార్లు స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన అద్దంకి దయాకర్, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు నగరి ప్రీతం ,తుంగతుర్తి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అన్నపర్తి జ్ఞానసుందర్ల , పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లు సమాచారం .ఈ ముగ్గురి పేర్లపై నియోజకవర్గంలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ ముగ్గురి పేర్లు పరిశీలించారా ?లేక ఏఐసీసీకి పంపే జాబితాలో ఉంచారా ?అనేది తెలియాల్సి ఉంది .అద్దంకి దయాకర్ గత రెండుసార్లు పోటీల్లో ఉన్నప్పుడు మొదటిసారి తెలంగాణ సెంటిమెంటుతో ఓడిపోవడం రెండవసారి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పోటీలో ఉండి ఓడించడం వల్లనే ఓడిపోయాడని అధిష్టానం భావిస్తే మూడవసారి తుంగతుర్తి అభ్యర్థిత్వానికి అద్దంకి పేరు ఖరారు చేసే అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు .అంతేగాక అద్దంకి దయాకర్ తన ఓటమి ఫలితాలపై హైకోర్టులో వేసిన కేసు సైతం ఇదే సమయంలో బెంచ్ పైకి రావడం అధికార పార్టీ అభ్యర్థి వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టి వేయడం రాష్ట్రంలో ఇటు తుంగతుర్తి నియోజకవర్గంలో నేడు సంచలనం రేపుతుంది .ఇటీవల వెలువడిన న్యాయస్థానాల తీర్పులలో పలువురు ఓడిపోయిన అభ్యర్థులను గెలిచిన అభ్యర్థులుగా కోర్టు ప్రకటించడం గమనార్హం.

ఇదే తీరులో అద్దంకి దయాకర్ కూడా కోర్టు కేసులో విజయం సాధిస్తే మూడోసారి పోటీకి సునాయాసంగా మార్గం సుగమం అవుతుందని రాజకీయ పరిశీలకుల మాట. ఇద మిద్దంగా ఎక్కువ శాతం అధిష్టానం అద్దంకి వైపే ముగ్గు చూపుతుందని పలువురు సీనియర్ నాయకుల మాటగా తెలుస్తోంది .అద్దంకి దయాకర్ సైతం తాను చేసిన పొరపాటు ఏమీ లేదని ప్రజల బలం తనకు ఉందని కావాలని ఓడించారు తప్ప వేరే ఏమీ లేదని అంటున్నారు. తనకు ఈసారి అది స్థానం పోటీకి అవకాశం కల్పిస్తే విజయం సాధిస్తానని ఒకవేళ ఇవ్వని పక్షంలో సైతం ఎవరికిచ్చినా మద్దతు ఇస్తానని మాట చెబుతున్నారు. అంతేగాని తాను మరో చోటు నుండి పోటీ చేసే ప్రసక్తే లేదని అద్దంకి మాట .అలాగే నాగరి గారి ప్రీతం రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షునిగా కొనసాగుతూ తనకు ఈసారి అవకాశం ఇవ్వాలని టిఆర్ఎస్ ను ఓడించడానికి తాను సిద్ధమని అధిష్టానం తనకు తప్పకుండా అవకాశం కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు . మరో నాయకుడు అన్నపర్తి జ్ఞాన సుందర్ తనకు ఎన్నో అవకాశాలు వచ్చిన అవి తృటిలో జారిపోయాయని అనునిత్యం ప్రజల్లో ఉంటున్న తాను ఎన్ఎస్యు ఐ నుండి నేటి కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి వరకు కొనసాగుతున్నానని తుంగతుర్తి ప్రజల కోసం అనేక ఉద్యమాలు చేశానని ఆ విషయం నియోజకవర్గ వ్యాప్తంగా అందరికీ తెలుసని అంటున్నారు . తనకు ఈసారి అవకాశం ఇస్తే అధికార పార్టీ అభ్యర్థిని మట్టికరిస్తానని అధిష్టానం తప్పకుండా తన పేరు పరిశీలిస్తుందని పోటీకి అవకాశం ఇస్తుందని ఆశాభావం బలంగా వ్యక్తం చేస్తున్నారు .అధిష్టానానికి పంపే మూడు పేర్లలో వీరి ముగ్గురీ పేర్లే ఉన్నాయా లేక మరెవరైనా జాబితాలో చేరుతారా ?అనేది తేలాల్సి ఉంది .

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సైతం వారి వారి పలుకుబడి ప్రకారం తమ తమ ప్రయత్నాలు ముమ్మరంగానే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక భారంతో కూడుకున్న ఎన్నికలు రానున్నాయని అధిష్టానం సైతం అభ్యర్థి ఆర్థిక స్తోమతను సైతం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందని దీంతో చాలామంది అభ్యర్థులు వెనుకకు పోయే అవకాశం ఉంటుందనేది పలువురి మాట .ప్రజాబలం ఉంటేనేసరిపోదని అందుకు తగ్గ ఆర్థిక సామాజిక బలం కూడా తోడు కావాల్సి ఉందని అధిష్టానం ఆ దిశగానే అభ్యర్థుల కోసం వెతుకుతుందనేది కాంగ్రెస్ నేతల మాటగా తెలుస్తోంది .అంతేగాక తుంగతుర్తి నియోజకవర్గ అభ్యర్థి గెలుపోటములు సైతం పక్కనే ఉన్న సూర్యాపేట అభ్యర్థి పై ఆధారపడి ఉంటుందని అక్కడ మాజీ మంత్రిని కాదంటే తుంగతుర్తిలో మాజీ మంత్రి కేడర్ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిస్తారా ?అనేది కూడా ఇప్పుడిప్పుడే తెరపైకి వస్తున్న అంశం. సూర్యాపేటలో మాజీ మంత్రికి నూటికి నూరు శాతంఅవకాశం ఇస్తేనే తుంగతుర్తిలో కాంగ్రెస్ విజయానికి అవకాశాలు ఉంటాయనేది సీనియర్ కాంగ్రెస్ నాయకుల మాట సూర్యాపేటకు తుంగతుర్తి కి అభ్యర్థుల ఎంపికలో అవినాభావ సంబంధం ఉంటుందని అక్కడ మాజీ మంత్రికి ఇచ్చిన ఇక్కడ మాజీ మంత్రి మద్దతు లేనిదే అభ్యర్థి గెలుపు కష్టమనేది గతంలోనే రుజువైన విషయం అందరికీ తెలిసిందే .ఇదంతా పరిగణలోకి తీసుకుని కాంగ్రెస్ అధిష్టానం సరైన వ్యక్తిని ఎంపిక చేస్తుందని పలువురు కాంగ్రెస్ పరిశీలకులు అంటున్నారు ఏది ఏమైనా ఏ ముగ్గురి పేర్లు పరిశీలనకు వెళ్లాయో ఆ ముగ్గురిలో ఏ అభ్యర్థి తుంగతుర్తి అభ్యర్థిగా పోటీకి వస్తారో కొద్ది రోజులు వేచి చూడాల్సిందే .అంతదాకా కాంగ్రెస్ శ్రేణులకు ఉత్కంఠత తప్పకపోవచ్చు.