పులిందర్ రెడ్డి హత్య కేసులో తీర్పు వెల్లడించిన సూర్యాపేట జిల్లా కోర్టు

పులిందర్ రెడ్డి హత్య కేసులో తీర్పు వెల్లడించిన సూర్యాపేట జిల్లా కోర్టు
  • నిందితులకు యావజ్జివ శిక్ష విధించిన జిల్లా కోర్టు
  • ఆరుగురు నిందితులలో ఒక నిందితుడి మరణంతో ఐదుగురికి తీర్పు వర్తింపు

ముద్ర ప్రతినిది , కోదాడ:-సూర్యాపేట జిల్లా ,మునగాల మండలం , నర్సింహులగూడెం గ్రామానికి చెందిన అప్పటి సర్పంచ్ జూలకంటి పులిందర్ రెడ్డి ని 2014 జనవరి 30 న కోదాడ లోని హుజూర్ నగర్ రోడ్డు బైపాస్ బ్రిడ్జి వద్ద అతి కిరాతకంగా కత్తులతో నరికి హత్య గావించబడిన కేసులో సూర్యాపేట జిల్లా కోర్టు శుక్రవారం తుది తీర్పు వెల్లడించింది . దాదాపు ఐదు సంవత్సరాలుగా విచారణ కొనసాగుతుండగా శుక్రవారం తీర్పు వెల్లడించింది . ఈ కేసులో ఉన్న ఆరుగురు నిందితులకు సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ యావజ్జివ శిక్ష విధిస్తు తీర్పు వెల్లడించారు . అయితే కేసు విచారణ సమయంలోనే జలీల్ అనే నిందితుడు మృతి చెందాడు . దీనితో మిగతా ఐదుగురు నిందితుల కు జీవిత ఖైదు శిక్ష విధించారు న్యాయమూర్తి . వారి వివరాలు .. షేక్. షబ్బీర్ , కొప్పుల. లక్ష్మీనారాయణ , షేక్ . ఇబ్రహీం ,మాతంగి . శ్రీను , ధూళిపాల. నరేందర్. కాగా కోర్టు తీర్పు నేపథ్యంలో నర్సింహుల గూడెం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలు భారీగా మోహరించారు .