సాగునీరు తాగునీటిని వెంటనే విడుదల చేయాలి

సాగునీరు తాగునీటిని వెంటనే విడుదల చేయాలి
  • నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలి

చిలుకూరు ముద్ర : సాగర్ ఆయకట్టకు  త్రాగునీటి సాగునీరుని వెంటనే విడుదల చేయాలని, అఖిలపక్షం సిపిఐ కాంగ్రెస్ టిడిపి ఆధ్వర్యంలో శుక్రవారం చిలుకూరు మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో కోదాడ హుజూర్నగర్ హైవేపై రాస్తారోకో  నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమం సందర్భంగా పలువురు అఖిలపక్ష నాయకులు, మాట్లాడుతూ, నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని, భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని, బోర్లలో బావిలలో నీరు, లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, త్రాగునీరు కోసం వెంటనే నీటిని ఒకసారి అన్న విడుదల చేసి రైతులను ఆదుకోవాలని, నీరు లేక పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, అఖిలపక్ష నాయకులు  అన్నారు, ఈ కార్యక్రమంలో, చిలుకూరు సర్పంచ్ కొడారు,  వెంకటేశ్వర్లు ,సిపిఐ పార్టీ చిలుకూరు మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, టిడిపి కోదాడ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రభాకర్ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమరాపు శ్రీమన్నారాయణ  టిడిపి చిలుకూరు మండల  అధ్యక్షులు సాతులూరి గురవయ్య, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్, ఎడవెల్లి పుల్లారావు,  కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, సొందు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి, దొడ్డ వెంకటయ్య, సిపిఐ పార్టీ చిలుకూరు గ్రామ శాఖ కార్యదర్శి సాయి బల్లి, అలసకాని వెంకటయ్య, కొల్లు సత్యనారాయణ, కొండ సోమయ్య, కోదాడ టిడిపిటౌన్ అధ్యక్షులు జనపనేని కృష్ణారావు,గుండు వీరబాబు, వార్డ్ మెంబర్ భేగం,రవి, మండవఅచ్చయ్య,నాగేశ్వరరావు,రాములు, కాశయ్య, కొల్లు నాగయ్య, సుల్తాన్ వెంకటేశ్వర్లు, కొల్లు నరసింహారావు,లక్ష్మయ్య, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.