తుంగతుర్తి పశువైద్యశాలలో జునోసిస్ డే కార్యక్రమం

తుంగతుర్తి పశువైద్యశాలలో జునోసిస్ డే కార్యక్రమం
  • పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్
  • ప్రజలు జంతువుల వల్ల వచ్చే వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి
  • తుంగతుర్తి పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ రవి ప్రసాద్

తుంగతుర్తి ముద్ర: జంతువుల నుండి మానవులకు సంక్రమించే వ్యాధులను జునటిక్ వ్యాధులు అంటారని అలాంటి వ్యాధు లకు గురికాకుండా అవగాహన కల్పించడం కోసం జునోసిస్ డే జరుపుకుంటున్నామని తుంగతుర్తి  పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ రవి ప్రసాద్ అన్నారు. స్థానిక పశువైద్యశాలలో ఏర్పాటు చేసిన జునసిస్ డే కార్యక్రమంలో జంతువులకు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టి మాట్లాడారు .1885 జూలై 6న టూ ఇన్ ఫ్రాక్చర్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా యాంటీ రాబిస్ ఇంజక్షన్ పిచ్చి కుక్క కాటు కోసం తయారుచేసి విజయం సాధించారని అందువల్ల ప్రతి సంవత్సరం జూలై ఆరవ తేదీన జునోసిస్ డే గా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు.

ఇదే రోజు ప్రజలు జునోటిక్  సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు సూచనలు చేయడం జరుగుతుందని అన్నారు .వృత్తిరీత్యా ఆయావృత్తుల్లో వారికి తొందరగా వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుందని అన్నారు .కుక్క లతో సన్నిహితంగా ఉండే వారికి రేబిస్  హైటాటిసోసిస్ కసాయి వారికి దొమ్మ వ్యాధి, డైరీ ఫారాలలో పనిచేసే వారికి పశువైద్యులకు    బ్లూ సెల్లోసిస్ ,కోళ్ల ఫారం లో పనిచేసే వారికి సిట్ట కో సిస్ లాంటి వ్యాధులు సోకుతాయని అన్నారు. జునటిక్ వ్యాధులు గాలి నీరు ఆహారం కలుషితమైన పశు ఉత్పత్తులను వినియోగించడం ద్వారా మనుషులకు వ్యాధి వ్యాపించి ప్రాణనష్టం జరుగుతుందని అన్నారు .జంతువులతో సన్నిహితంగా ఉండే వారికి జునటిక్ వ్యాధుల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు .జునసిస్ డే సందర్భంగా తుంగతుర్తి లో పశు వైద్యశాలలో పలు పెంపుడు కుక్కలకుయాంటీ రేవిస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది .ఈ కార్యక్రమంలో డాక్టర్ మమత ,వి ఏ సుష్మ ,విజయ్, బాబు ,ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.