బీసీలకు చేయూత  నిరంతర ప్రక్రియ

 బీసీలకు చేయూత  నిరంతర ప్రక్రియ
  • సమైక్య పాలనలో చేతి వృత్తులు ధ్వంసం
  • కులవృత్తులను ఆదుకుంటున్న కేసీఆర్
  • 686 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ 
  • రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :బీసీలకు చేయూత కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.కరీంనగర్ లోని పద్మనాయక కళ్యాణ మంటపంలో 686మంది లబ్ధిదారులకు మంత్రి గంగుల చెక్కులు పంపిణీ చేశారు.ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమైక్య పాలనలో చేతి వృత్తులు ధ్వంసం అయ్యాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.కనుమరుగైన కులవృత్తులను కాపాడాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కులవృత్తులను ఆదుకుంటున్నారన్నారు . తెలంగాణ తెచ్చుకున్నదే వెనుకబడిన వర్గాలు ఆర్ధికంగా ఎదగాలని అన్నారు. చెక్కులు రాని లబ్ధిదారులు నిరాశ పడకూడదని విడతలవారీగా అందరికీ బీసీ బందు చెక్కులను అందజేస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ గారు అన్ని కులాలను సమాన దృష్టి తో చూస్తున్నారని వెల్లడించారు.  కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకతీతంగా అందరికి అందుతున్నాయి.

బీసీ బంధు ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందని లబ్ది దారులు ఎవరికీ లంచాలు ఇవ్వొద్దని అన్నారు . లంచం ఇచ్చినట్టు తమ దృష్టికి వస్తే ఇచ్చినవారు తీసుకున్నవారు ఇద్దరిని దోషులుగా పరిగణిస్తామని. అవసరమైతే కలెక్టర్ గారికి చెప్పి చెక్కును వాపాస్ తీసుకుని మరో లబ్ధిదారునికి అందజేస్తామని అన్నారు. గత ప్రభుత్వాల హాయంలో లక్ష రూపాయల లోనుకు లక్షసార్లు తిప్పిచేవారని అన్నారు. బిజెపి కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల్లో కల్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. దేశంలోఇక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో వేలకొద్ది పథకాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఎన్నికల అప్పుడు వచ్చే రాజకీయ నాయకులను ప్రజలు నమ్మొద్దని  గతంలో ఓట్లు వేయించుకొని ముఖం చాటేసిన రాజకీయ పార్టీలు మళ్లీ ఓట్ల కోసం వస్తున్నాయని వారి పట్లప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచేది ప్రజల గుండెల్లో ఉన్న గులాబీ జెండా అని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కలెక్టర్ బి గోపి,  అడిషనల్ కలెక్టర్లు లక్ష్మికిరణ్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు , జడ్పిటిసిలు  పిట్టల కరుణ రవీందర్. పురమల్ల లలిత -శ్రీనివాస్ ఎంపీపీలు తిప్పర్తి లక్ష్మయ్య పిల్లి శ్రీలత-మహేష్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, బీసీ వెల్ఫేర్ అధికారి అనిల్ ప్రకాష్ కార్పొరేటర్లు సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.