చిన్న ములుకనూర్ లో ఛాయ్ విత్ పొన్నం కార్యక్రమం

చిన్న ములుకనూర్ లో ఛాయ్ విత్ పొన్నం కార్యక్రమం
  • శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు
  • బస్టాండ్ చౌరస్తాలో ఛాయ్ విత్ పొన్నం కార్యక్రమంలో గ్రామస్థులతో కలిసి ఛాయ్ తాగిన పొన్నం ప్రభాకర్

చిగురుమామిడి ముద్ర న్యూస్: హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకుని తొలిసారిగా చిగురుమామిడి మండలం సీఎం దత్తత గ్రామమైన చిన్న ములుకనూర్ లో ఛాయ్ విత్ పొన్నం కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు పూదరి వేణుగోపాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పొన్నం అభిమానులు పొన్నం ప్రభాకర్ కు ఘనస్వాగతం పలికారు. బస్టాండ్ చౌరస్తా నుంచి గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం వరకు కాలినడకన తోడ్కొని వెళ్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిమానులు పొన్నం కు పూలమాల వేసి శాలువా సత్కరించారు. అనంతరం బస్టాండ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఛాయ్ విత్ పొన్నం కార్యక్రమంలో పాల్గొన్న పొన్నం ప్రభాకర్ గ్రామస్థులతో కలిసి ఛాయ్ తాగారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో పొన్నం మాట్లాడుతూ ఈ గ్రామాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకుని ఎన్నెన్నో మోసపూరిత వాగ్దానాలు చేసి ముఖం చాటేసిన సీఎం కేసీఆర్ కు,బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఫంక్షన్ హాల్ కట్టిస్తానని, మినీ ట్యాంక్ బండ్ చేస్తానని, ఊరును అద్దం తునకలాగా చేస్తానని ఊరందరికీ దావత్ ఇచ్చి చెప్పి అడ్రస్ లేకుండా పోయాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి మా ఇంటికి వస్తాడు అని గొప్పగా చెప్పుకునే స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ ఎందుకు పట్టించుకోవడం లేదని పొన్నం ప్రశ్నించారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మీకు మంచిరోజులు వస్తాయని మీబిడ్డగా హామీ ఇస్తున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి చిటుమల్ల రవీందర్, జిల్లా అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత, ఉప సర్పంచ్ పైడిపల్లి నరేష్, వార్డు సభ్యులు అనీల్, చివరాల వంశీకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పిట్టల రాజు, మాజీ ఉపసర్పంచ్ సాంబారి బాబు, గజ్జల రాములు, ముస్కుల ప్రభాకర్ రెడ్డి, వంగపల్లి సాయిలు, బూస చంద్రయ్య, రంగు శ్రీధర్, వంగల రాము, బండారుపెళ్లి ఆంజనేయ గౌడ్, చిలువేరు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.