దేశమంతా రాహుల్ వెంటే

దేశమంతా రాహుల్ వెంటే

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : రాహుల్ గాంధీ పై  అనర్హత వేటు  బిజెపి రాజకీయ కుట్రలో భాగమే అని కాంగ్రెస్ ఓబీసీ జిల్లా అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్ అన్నారు. పార్లమెంటు కార్యదర్శి నిర్ణయాన్ని నిరసిస్తూ కరీంనగర్ కోర్టు చౌరస్తాలో కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటికి నల్ల రిబ్బన్ లు కట్టుకొని వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్నారు. దేశ ఐక్యతను చాటేలా భారత్ జోడో నినాదంతో దేశ వ్యాప్త పాదయాత్ర చేసిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ కి పెరుగుతున్న మద్దతును మోడీ తట్టుకోలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు. దేశమంతా రాహుల్ వెంటే ఉందన్నారు. బిజెపి ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోడీ నియంతృత్వాన్ని దేశమంతా ముక్తకంఠంతో ఖండిస్తుందని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వైద్యుల అంజన్ కుమార్, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ కార్యవర్గ సభ్యులు దేవన్న, గుండా మల్లేష్, గుర్రం రమేష్ గౌడ్, వరహాల చారి, లింగమూర్తి, ఎల్లమ్మల కృష్ణ, కడారి రాజేష్, కోల ప్రభాకర్,  కడారి రాముడు,  పోతుగంటి శ్రీనివాస్, పంజాల శ్రీనివాస్ గౌడ్, రాముడి రాజిరెడ్డి, శివరాం కాడె శంకర్, గుడ్ల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.