అంబెడ్కర్ ఆశయాలను సాదిద్దాం..

అంబెడ్కర్ ఆశయాలను సాదిద్దాం..

 అడిషనల్ కలెక్టర్ అభిలాషఅభినవ్.. 

ముద్రప్రతినిధి, మహబూబాబాద్: భారత రత్న , రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలోను, పాటించడంలోను కృషి జరిపినప్పుడే వారికి మనమిచ్చే ఘనమైన నివాళి అని అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్  అన్నారు. మహబూబాబాద్ లో శుక్రవారం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 132వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ డేవిడ్ తో కలిసి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం సభను జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ...
ప్రపంచంలోని అన్నిదేశాల రాజ్యాంగాలను పరిశీలించి భారతదేశ ప్రజల మనోభావాలను  దృష్టిలో పెట్టుకొని దేశరాజ్యాంగాన్ని రచించడంతో మనందరికీ  ప్రజాస్వామ్యం లభించిందన్నారు.  అంటరానితనం, అసమానతలను రూపుమాపేందుకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సౌభాతృత్వాన్ని సమానంగా అనుభవించే విధంగా రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన మహానుభావుడని కొనియాడారు. ప్రజలందరూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేసినప్పుడే మనమిచ్చే ఘనమైన నివాళి అన్నారు. ప్రభుత్వం అన్ని రంగాలలో అవకాశాలు కల్పిస్తున్నందున వినియోగించుకొని  రాణించాలన్నారు. జిల్లాలో నాణ్యమైన విద్యకు గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగిందని, పోటీతత్వం పెంపొందించుకొని పట్టుదల, క్రమశిక్షణతో ఉన్నత చదువులు చదవాలని కోరారు. విద్య ద్వారానే ఉన్నత స్థానానికి ఎదుగుతామని సమజాభివృద్ధికి పాటుపడ గలుగుతామన్నారు.

దళిత బంధు పధకం ప్రవేశపెట్టి 305 మంది కి మంజూరు చేయడం జరిగిందని, అట్టడుగు బడుగు బలహీన వర్గాల కుటుంబాల బలోపేతం కొరకు కృషి చేయడం జరుగుతుందన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న ఒక్కొక్కరికి రూ.2.50 లక్షలు చొప్పున  ప్రోత్సాహక బహుమతి చెక్కులు అందజేశారు. అంతకుముందు కోర్ట్ భవనం వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు. ఈ జయంతి మహోత్సవంలో డి ఆర్ డిఓ సన్యాసయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడి బాలరాజు, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ఎర్రయ్య, విద్యాశాఖ అధికారి రామారావు, కొండ్ర ఎల్లయ్య, సంజీవరావు, కిషన్ నాయక్, శివరాజ్, వీరస్వామి, శ్రీరామ్, టీఎన్జీవో ప్రెసిడెంట్ వడ్డెబోయిన శ్రీనివాస్, సతీష్,రాములు, లక్ష్మణ్ నాయక్ దర్శనం రామకృష్ణ, రాజమౌళి,కిరణ్ మనోజ్, మంద శశి కుమార్, చాగంటి ప్రభాకర్, శ్రీను తెలంగాణ సాంస్కృతి సారధి కళాకారులు తదితరులు పాల్గొన్నారు.