హారితా బయోటెక్ ప్లాంట్ ను సందర్శించిన కలెక్టర్

హారితా బయోటెక్ ప్లాంట్ ను సందర్శించిన  కలెక్టర్

ముద్ర ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హారితా బయోటెక్ ప్లాంట్ రెన్యూవల్ కోసం జిల్లా కలెక్లర్ కి ప్లాంట్ యాజమాన్యం ధరఖాస్తు చేసుకోగా బుదవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ ప్లాంట్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్ రెస్టోర్ కేంద్రాన్ని పరిశీలించి నీటి వినియోగం, అందుకు చేపట్టిన పైప్ లైన్, విద్యూత్ వినియోగం తదితర విషయాలను గురించి విచారించారు.  

అనంతరం పర్లపల్లి గ్రామంలొని ఫ్యాక్టరీని సందర్శించి అక్కడ చేపడుతున్న పనులు, మిషనరీ ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పర్లపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పరిశీలించి పాత ఫర్నిచర్ ను తరగది గదులలో నుండి తొలగించాలని అన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా పరిషత్ సిఈఓ ప్రియాంక, ట్రైని కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, యంపిడిఓ రవీందర్ రెడ్డి, తహసీల్దార్ కనకయ్య మరియు ఇరిగేషన్, పొల్యూషన్ అధికారులు హరితాప్లాంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.