ప్రతి ఇంటిపైన మువ్వన్నెల జెండాను  ఎగరేయాలి

ప్రతి ఇంటిపైన మువ్వన్నెల జెండాను  ఎగరేయాలి

ముద్ర, హుజురాబాద్: స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిపైన  మువ్వన్నెల జెండాను ఎగరవేయాలని  టూరిజం డెవలప్ మెంట్ చైర్మన్  గెల్లు శ్రీనివాస్ యాదవ్ కోరారు.  శనివారం పట్టణంలోని తపాల కార్యాలయంలో జాతీయ జెండాల విక్రయ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రతీ ఇంటిపైన జాతీయ జెండా ను ఆవిష్కరించాలనే ఉద్దేశ్యంతో "హర్ ఘర్ తిరంగా 2.0" కార్యక్రమం ద్వారా పోస్ట్ ఆఫీస్ లలో జాతీయ పతాకాలను దేశ పౌరులకు అందుబాటులో కీ  తపాలా శాఖ  తీసుకొచ్చిందన్నారు.  ముఖ్యమంత్రి కెసిఆర్  గత సంవత్సర కాలం నుండి రాష్ట్రంలో అద్భుతంగా ఉత్సవాలను జరుపుతున్నారని , ఈ సంవత్సరం కూడా దేశ రాష్ట్ర ప్రజలు కేవలం రూ.25లు చెల్లించి పోస్ట్ ఆఫీస్ లలో జాతీయ పతాకాన్ని కొనుగోలు చేసి త్రివర్ణ పతకాన్ని ప్రతి ఇంటిపైన ఆవిష్కరించి దేశ సమైక్యతను  చాటాలన్నారు.  ఈ కార్యక్రమంలో హెడ్  మాస్టర్ యు యు.గేందర్ తదితరులు ఉన్నారు.