కరీంనగర్ లో దారుణం

కరీంనగర్ లో దారుణం
  • బాలికపై ముగ్గురు అత్యాచారం?

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :మైనర్ బాలికపై ముగ్గురు అత్యాచారం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ దారుణ ఘటన కరీంనగర్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ప్రియుడితో బాలిక సన్నిహితంగా ఉన్నప్పుడు ప్రియుడు స్నేహితులు వీడియోలు, ఫోటోలు తీశారు. అవి చూపి బ్లాక్ మెయిల్ చేస్తూ బాలికపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల  ప్రకారం కరీంనగర్ పట్టణంలో ఓ కాలనీకి  చెందిన  బాలిక పదవ తరగతి చదువుతుంది.  అదే కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థి ప్రేమ పేరిట బాలికకు దగ్గరయ్యాడు. కొన్ని నెలల కింద బాలిక, ఆమె ప్రియుడు సన్నిహితంగా ఉన్న వీడియో, ఫోటోలను సీక్రెట్‌గా తీశారు. బాలిక తల్లిదండ్రులకు విషయం చెబుతామని బెదిరించారు.

లొంగదీసుకుని బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న మరో ముగ్గురు స్నేహితులు బాలికను లొంగదేసుకునేందుకు ఒత్తిడి తెచ్చారు. సోమవారం బాలిక తల్లితండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో పోలీసులు బాలిక ప్రియుడితో సహా ఆరుగురిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు అయిన ఆరుగురిలో ఐదుగురు ఇంటర్ చదువుతుండగా ఓ వ్యక్తి పాలిటెక్నిక్ చదుతున్నట్లు తెలిసింది.