బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ముద్ర, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ  అధ్యక్షులు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో   జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాడు టిఆర్ఎస్ పార్టీ కి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారు. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలన్న బిల్లు పాస్ కావాలన్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాడాలన్న ,పార్లమెంట్లో మెజార్టీ ఎంపీలు కావాలి. ఇది గ్రహించి (భారతీయ జనతా పార్టీ ) తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, (భారతీయ జనతా పార్టీ)  ఎంపీలు బిల్లుకు మద్దతు తెలియజే చేసి.  బిజెపి ఎంపీ పార్లమెంటరీ నేత  సుష్మా స్వరాజ్  పార్లమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడి బిల్లుకు మద్దతు తెలియచేసి, తెలంగాణ బిల్లును పాస్ చేయించి,తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయించిన ఘనత భారతీయ జనతా పార్టీది అన్నారు.

ఈ కార్యక్రమంలో జీడి మల్లేష్, పల్లపు రవి ,మోతె స్వామి, ఇటికాల సరూప, అప్పం మధు యాదవ్, మోడెo రాజు, గిరివేని విజేందర్, రేవెల్లి శీను, గర్రెపల్లి నిరూప రాణి, ఎండి రజియా A రామస్వామి, అన్నపూర్ణ ,కనుమల లక్ష్మి, మైస భాగ్య, L మొగిలి తదితరులు పాల్గొన్నారు.