మిషన్ భగిరథతో తాగు నీటి కష్టాలకు చెక్ 

మిషన్ భగిరథతో తాగు నీటి కష్టాలకు చెక్ 
  • ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు 

ముద్ర, మెట్ పల్లి : సమైక్య రాష్ట్రంలో తాగునీటి సమస్యతో దశాబ్దాల పాటు ఇబ్బందులు పడ్డ ప్రజలకు.. స్వరాష్ట్రంలో మిషన్‌ భగీరథతో సీఎం కేసీఆర్‌ శాశ్వత పరిష్కారం చూపించారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తెలంగాణ మంచి నీళ్ళ పండుగ సందర్భంగా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దావ వసంతతో కలిసి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మిషన్ భాగిరథతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారని అన్నారు. మిషన్ భగీరథ గ్రీడ్డ్ భాగంగా,   జగిత్యాల జిల్లాలోని 5 మున్సిపాలిటీలకు మరియు 20 మండలాలకు చెందిన 497 ఆవాసాలలోని 9 లక్ష 88 వేల జనాభాకు, ఒక్కరికి రోజుకి 100 లిటర్లు  చొప్పున మంచినీరు  సరఫరా చెయుటకు రూ.1430,00 కోట్ల ఖర్చుతో పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. సాంకేతిక అవసరాన్ని బట్టి  కావలసిన నిర్మాణాలు, పైప్ లైన్ పూర్తి చేసి  కోరుట్ల, మెట్టుపల్లి, జగిత్యాల, రాయికల్, ధర్మపురి  మున్సిపాలిటీలకు  497 అవాసాలలోని అన్ని నీటి  ట్యాంకులకు  మంచినీరు సరఫరా చేయటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్  మంద .మకరందు, వినోద్, ఎంపీపీలు, జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ చైర్ పర్సన్లు,  మిషన్ భగీరథ సిబ్బంది పాల్గొన్నారు.