దళిత బంధు అమలు చేయాలంటూ ఆర్డీవోకు వినతి పత్రం

దళిత బంధు అమలు చేయాలంటూ ఆర్డీవోకు వినతి పత్రం

ముద్ర, హుజురాబాద్: నియోజకవర్గం లో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం అమలు చేయాలని కోరుతూ శుక్రవారం బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి హుజురాబాద్ ఆర్డీవో కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు పథకం    మండలాల్లో  నీ   ప్రతి దళిత కుటుంబానికి అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకాన్ని నేటి కూడా ప్రతి దళిత కుటుంబానికి  అందించకపోవడంతో  పథకానికి నోచుకోలేని దళితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు,అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి,జిల్లా కార్యాలయ కార్యదర్శి మాడుగుల ప్రవీణ్,ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తూర్పాటి రాజు, కౌన్సిలర్ పైళ్ళ వెంకట్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, జమ్మికుంట అధ్యక్షులు జీడిమల్లేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు తుముల శ్రీనివాస్,ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి రాజేష్, ఠాగూర్ కిసాన్,మోర్చా జిల్లా కార్యదర్శి మారం తిరుపతిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.