విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం 

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం 

జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకని జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని వికేబి పంక్షన్ హాల్ లో  పిఆర్ టి యుఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి యాళ్ళ అమర్నాథ్ రెడ్డి, బోయిని పెళ్లి ఆనందరావు అధ్వర్యంలో పదవ తరగతిలో 100% ఫలితాలు సాధించిన హెచ్ ఎంలకు 10 జిపిఏ సాధించిన విద్యార్థులకు ప్రతిభా అవార్డుల ప్రధానం చేశారు. అవార్డు ప్రధానోత్సవంలో పాల్గొన జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత, ఎమ్మెల్సీలు కూర రఘోత్తం రెడ్డి, పులా రవీందర్ లు జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూల్స్, గురుకుల పాఠశాలలలో 10 జిపిఏ సాధించిన 22మంది విద్యార్థులకు, 100% ఫలితాలు సాధించిన 29 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రతిభా అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఆర్ టి యుఎస్  మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గుర్రం చెన్నకేశవరెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శి పింగలి శ్రీ పాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు, డిఇఓ   డా. జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు A V N రాజు, P. చంద్ర ప్రకాష్ రెడ్డి, బొమ్మకంటి రవి, వుటూరి మాహేష్, అబ్దుల్ జమిల్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు పన్నాల లింగారెడ్డి & మచ్చ రాజశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జమున, సురేఖ, జయప్రద, పద్మ వసంత, శ్రీదేవి, దండే గంగాధర్, సత్యరాజు, మండల విద్యాధికార్లు గాయత్రి, జమున భూమయ్య, భీమయ్య,  మండలాల అధ్యక్షులు, ప్రధానకార్యదర్శులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గోన్నారు.