కౌశిక్ రెడ్డితో ముదిరాజులకు బె షరతుగా క్షమాపణ చెప్పాలి

కౌశిక్ రెడ్డితో ముదిరాజులకు బె షరతుగా క్షమాపణ చెప్పాలి
  • కౌశిక్ వాక్యాలను ఖండించిన జోగు రామన్నను అబినందిస్తున్న 
  • తెలంగాణాలో ఇప్పటికే  60 స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులు ఖరార్ 
  • బిఆర్ ఎస్ మునిగిపోయే నావా 
  • బీసీ యాక్షన్ ప్లాన్ లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ
  • రాజ్యాంగ సవరణ చేసి బిసి రిజర్వేషన్ 60 శాతానికి పెంచాలి: ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఎమ్మెల్సీ  కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, కౌశిక్ రెడ్డి బలహీన వర్గాలకు, ముదిరాజు సామాజిక వర్గానికి బే షరతుగా క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి  రాష్ట్ర ప్రథమ పౌరురాలు గవర్నర్ విమర్శించడం యావత్ మహిళా ప్రపంచాన్ని కించపరిచారని, అందుకు సమన్లు జారీ అయ్యి బహిరంగ క్షమాపణ చెప్పిన కౌశిక్ రెడ్డి పెత్తందారి ఆలోచన విధానం, భూస్వామ్య విధానంలో నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన ఇప్పటికి అదే విధంగా కొనసాగడం దురదృష్టకరం అన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా కౌశిక్ రెడ్డి వాక్యాలు ఉన్నాయని ఖండించడం ఆహ్వానించదగిన విషయం, నేను అభినందిస్తున్నాను... బిఆర్ఎస్ లో కూడా బలహీనవర్గాల ఆత్మగౌరవాన్ని గౌరవించే విధంగా ధైర్యంగా మాట్లాడగలగడం అభినందనీయం అన్నారు. బలహీనవర్గాలను ఆర్థికంగా అభివృద్ధి వైపు తీసుకపోవడంతో పాటు రాజకీయంగా సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 5 శాతం ఉన్న ఉన్నత వర్గాలు సీఎంతో సహా పదిమంది మంత్రులు ఉన్నారు. 60 శాతం ఉన్న బలహీన వర్గాల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సామాజిక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కొనసాగింది కానీ స్ఫూర్తి కొరవడి భూస్వామ్య పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. 

అధికారంలోకి వచ్చాక బలహిన వర్గాలకు ఉద్యోగ కల్పన మర్చిపోయారు... 80 వేల ఖాళీలు ఉన్నాయని చెప్పిన  సీఎం 8 కూడా భర్తీ చేయలేదన్నారు. బీసీ యాక్షన్ ప్లాన్ లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని బలహీన వర్గాల్లో 90 శాతం మందిని పక్కనపెట్టి 10 శాతం మందికే లక్ష ఆర్థిక సాయం అందించడం బిసిలను మోసం చేయడమే అన్నారు. పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఇంత చర్చ జరుగుతున్న బిఆర్ఎస్ పార్టీలో చలనం లేకపోవడం బాధాకరం. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లేదా కార్యనిర్వాహక అధ్యక్షుడు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పినట్టు బలహీన వర్గాలకు కూడా క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. 60 శాతం ఉన్న బలహీనవర్గాలకు 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు. ఉన్నత వర్గాలకు ప్రత్యేక 10 శాతం  రిజర్వేషన్ కల్పించడానికి రాజ్యాంగాన్ని సవరించిన విధంగా బలహీన వర్గాల కోసం రిజర్వేషన్ పెంచేందుకు రాజ్యాంగాన్ని ఎందుకు సవరించడం లేదు అని ప్రశ్నిచారు. బీసీల కు 60 శాతం రిజర్వేషన్ పెంచాల్సిన ఆవశ్యకత ఉంది.. ఆరు సంవత్సరాలుగా ముదిరాజులను బీసీ ఏ లో చేర్చే బీసీ కమిషన్ నివేదిక ఇంతవరకు సమర్పించలేదు..దీన్నిబట్టి తెలుస్తుంది బీసీల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అని అన్నారు. కౌశిక్ రెడ్డి తో బహిరంగంగా ముదిరాజ్ వర్గానికి క్షమాపణలు చెప్పించాలి. లేదంటే బిఆర్ఎస్ పార్టీకి బలహీన వర్గాలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు.  బిఆర్ఎస్ పార్టీ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫలమైందని, గద్దించటానికి అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

 కర్నాటక  ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నయం టీఆర్ఎస్ అని ప్రజల్లో ఏర్పడింది. పొంగులేటి జూపల్లి కృష్ణారావులో కాదు యావత్ ప్రజానీకం కాంగ్రెస్కు మద్దతు తెలపడానికి సిద్ధమయ్యారని అన్నారు. బిఆర్ఎస్ పార్టీని గద్దె దించే స్థాయిలో బిజెపి పోరాటం లేదని ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి ప్రత్యాన్మాయాన్ని ఆలోచించాల్సిన పరిస్థితి గోచరిస్తుందని పేర్కొనడమే అందుకు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి మారడం ఒకప్పటి చరిత్ర.. ప్రభుత్వం ఏర్పడ్డాక బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వస్తారు.. కాంగ్రెస్ టిఆర్ఎస్ ఎప్పుడు కలిసి పోటీ చేయదని, ఏ సిద్ధాంతం లేని పార్టీ బిఆర్ఎస్.. బిఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావా అన్నారు. మునిగిపోయే నావను  ఎవరైనా ఆసరాగా చేసుకుంటారా అని అన్నారు.  అప్పుడే కాంగ్రెస్, బిజెపికి సమ దూరం  అంటారు... అమిత్ షా అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నారంటే మీ అర్థం ఏంటి. అప్పుడే అమిత్ షా వద్దకు వెళ్లి మోకరిల్లుతాడని. నిన్నటి వరకు ఇద్దరు దాగుమూతలాడాగ ఇప్పుడు బయటపడ్డాయని బిఆర్ఎస్ పార్టీలో అవకాశవాదం కనిపిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో 60 స్థానాలకు అభ్యర్థులు ఖరారు అయ్యారని వారు  క్షేత్రస్థాయిలో పని కూడా చేసుకుంటున్నారని అన్నారు. బిఆర్ ఎస్ అభ్యర్థుల జాబితా ఎప్పుడు ప్రకటించిన మాకు సంబధం లేదని అన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, బండ శంకర్, కల్లపెల్లి దుర్గయ్య, మన్సూర్, గుండా మధు, నేహల్, చాంద్ పాషా, పుర్నచంధర్ తదితరులు పాల్గొన్నారు.