కృష్ణమ్మ కు పూజలు చేసిన మాచర్ల బిజెపి నాయకులు

కృష్ణమ్మ కు పూజలు చేసిన మాచర్ల బిజెపి నాయకులు

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : భారతదేశం సాంకేతిక విప్లవాలకు నిలయమని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి అన్నారు. అల్ఫోర్స్ పాఠశాలలకు చెందిన  యువ శాస్త్రవేత్తలకు ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సాంకేతిక రంగంలో భారత్ అగ్రస్థానంలో కొనసాగడం అభినందనీయమన్నారు. ఇతర దేశాలకు సైతం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే స్థాయికి భారత్ చేరుకుందని వెల్లడించారు. నూతన ఆవిష్కరణలకు నిలయం భారత్ అన్నారు.

విద్యార్థులలో  దాగివున్న ప్రతిభను వెలికితీయడానికై నిపుణులైన ఉపాద్యాయులచే శిక్షణను ఇప్పిస్తూ అగ్రస్థానంలో నిలుస్తున్నామన్నారు. ఈ విద్యసంవత్సరంలో సుమారు 11 మంది విద్యార్థులు ప్రతిభను చాటి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారని వెల్లడించారు. రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము , అత్యుత్తమ శాస్త్రవేత్తల నుండి ప్రశంసలను పొందడం అల్ఫోర్స్ విద్యా విధానానికి నిదర్శనం అన్నారు.

 ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంస పత్రాలతో పాటు పతకాలను అందజేశారు. యం. పూజశ్రీ, కే. దేవ్ అశీశ్, వి. సంజీత రెడ్డి, జి. లాస్యశ్రీ, యం. సాయి వీనిల్, డి. విష్ణుచరణ్, శీజా, డి. శ్రీహష్, సజీనిన్, రొమైసా ఫాతిమా, యం. సాయిరేవంత్, యం. అగష్య అభినవ్, శ్రీజా రేడ్డి,  సన్మానం పొందిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాద్యాయులు, తల్లితండ్రులు, విద్యార్థులు పాల్గోన్నారు.