ఐ డి ఓ సి కార్యాలయానికి గోల్డెన్ ట్రోఫీ

ఐ డి ఓ సి కార్యాలయానికి గోల్డెన్ ట్రోఫీ

హర్ష వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: 7 వ గార్డెన్ ఫెస్టివల్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడిఓసి కార్యాలయానికి గోల్డెన్ ట్రోఫీ, ప్రశంషా పత్రంతో పాటు మెమెంటో రావడం పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్ హర్షం వ్యక్తం  చేశారు. ఐడిఓసి కార్యాలయాలల్లో పచ్చదనం పెంపొందించుటకు చేపట్టిన చర్యలపై రాష్ట్ర స్థాయి అధికారుల బృందం రాష్ట్రంలోని  ఐడిఓసి కార్యాలయాలను సందర్శించినట్లు ఆయన పేర్కొన్నారు.   శుక్రవారం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన 7వ గార్డెన్ ఫెస్టివల్ బహుమతులు ప్రధాన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి,  ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉద్యాన శాఖ సంచాలకులు హనుమంతరావు  చేతుల మీదుగా జిల్లా ఉద్యాన అధికారి జినుగు  మరియన్న గోల్డెన్ ల్ ట్రోఫీ, ప్రశంషా పత్రంతో పాటు మెమెంటో  అందుకున్నారని చెప్పారు.

ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ఐడిఓసి కార్యాలయంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో 205  పలు పూలు, పండ్లు, నీడ నిచ్చే మొక్కలతో పాటు పలు,  ఔషధ గుణాలు కలిగిన  వివిధ రకాల  మొక్కలు నాటినట్లు చెప్పారు.  వివిధ రకాల మొక్కలు, లాన్ తో ఐడిఓసి కార్యాలయం పచ్చిక బయళ్ళును సంతరించుకుందని చెప్పారు. భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారి ప్రక్కనే ఉండటంతో ప్రజలు ఐడిఓసి కార్యాలయాన్ని సందర్శించడం జరుగుతున్నదని చెప్పారు.  పచ్చదనాన్ని సంతరించుకున్నట్లు . మొక్కలు, లాన్ ఏర్పాటుతో ఆహ్లాదకరంగా తయారు చేయుటలో విశేష కృషి చేసిన జిల్లా ఉద్యాన అధికారి జినుగు. మరియన్నను, అటవీ డివిజనల్ అధికారి, ఆసాళ్ళ. అప్పయ్య ను కలెక్టర్ అభినందించారు. మొక్కలకు సమృద్ధిగా నీరు అందించేందుకు  18 లక్షల వ్యయంతో అధునిక పాపప్స్ (నీళ్లు విరజిమ్మే) ను, బిందు సేద్యపు పరికరాలు   ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.