వాగు ఉధృతికి ప్రమాదవశాత్తు ఒకరు గల్లంతు ఒకరు సురక్షితం

వాగు ఉధృతికి ప్రమాదవశాత్తు ఒకరు గల్లంతు ఒకరు సురక్షితం

భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ములకలపల్లి మండలం లోని పాములేరు వాగును దాటుతూ ప్రమాదవశాత్తు తల్లి కూతుర్లు కుంజా సీతమ్మ(45) కుర్సం జ్యోతి వాగు ఉధృతికి ఉధృతిలో కొట్టుకపోగా స్థానికులు జ్యోతిని రక్షించగా సీతమ్మ ఆచూకీ దొరకలేదు.

పాల్వంచ మండలం సంఘం వద్ద ముర్రేడ వాగు పొంగి పొరడంతో సంఘం, దంతులబోరా, ఎస్సీ కాలనీ బండ్రేవు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. భద్రాచలం పాల్వంచ రహదారి మధ్యలో నాగారం వద్ద బ్రిడ్జి మరమ్మతులు గురి కావడంతో పాల్వంచ భద్రాచలం కు రాకపోకలు నిలిచిపోయాయి. లక్ష్మీదేవి పల్లి మండలం బంగారుచిలక,  అల్లపల్లి మండలాలలో  కిన్నెరసాని వాగు ఉధృతి తో ఆయా ప్రాంతాలలో రాకపోకలు లేక ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు.